Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్.. నటించే ఆ స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

Sourav Ganguly Biopic:
క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సౌరవ్ గంగూలీది ఓ ప్రత్యేక పాత్ర కూడా ఉంది. అయితే సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ బయోపిక్ రావాలని కోరుకుంటున్నారు. తాజాగా దీనికి ఇప్పుడు ముహూర్తం వచ్చింది. అయితే గంగూలీ పాత్రలో నటించేదెవరు? ఇతని బయోపిక్‌ను ఏ దర్శకుడు తీస్తాడు? అనే విషయంపై చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఎందరో డైరెక్టర్లు, హీరోల పేర్లు వినిపించాయి.
ఈ క్రమంలో తన బయోపిక్ గురించి క్రికెట్ దిగ్గజం గంగూలీనే స్వయంగా తాజాగా తెలియజేశారు. ఈ బయోపిక్‌లో తన రోల్ చేసేది ఎవరనే విషయాన్ని గంగూలీ తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన గంగూలీ బయోపిక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి తెలిసినంత వరకు బయోపిక్‌లో తన రోల్ చేసేది రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rav) అని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ అయ్యే సరికి సమయం పట్టవచ్చని, దాదాపుగా ఏడాదిపైనే అవుతుందని తెలిపారు. దీంతో గంగూలీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల మూవీ టీం రాజ్‌కుమార్ రావ్‌ను సంప్రదించింది. ఈ సినిమాకు ఆయన కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. లవ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. అయితే ఈ సినిమాను విక్రమాదిత్య మొత్వానీ డైరెక్ట్ చేయనున్నాడు. గతేడాది రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమాలో రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో కనిపించాడు. తన నటనతో అందరినీ ఫిదా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లు కొల్లగొట్టింది. ఇదే కాకుండా గుడ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు పలు రికార్డులు కూడా సృష్టించింది. అయితే ఇదే కాకుండా రాజ్ కుమార్ దీనికి ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో కూడా నటించాడు.
తన అద్భుత నటనటకు ఫిదా అయి ఈ బయోపిక్‌లో సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బయోపిక్ కోసం ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్‌లను కూడా సంప్రదించారట. కానీ చివరకు రాజ్‌కుమార్ రావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. 2008లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే అతని బయోపిక్‌ను తీయాలని నిర్ణయించుకున్నారు.