Hardik pandya: హార్ధిక్ అవమాన భారం.. బయోపిక్ గా తీస్తే హిట్ పక్కా

Hardik pandya:
గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చప్పట్లు కొట్టిన వాళ్లే అతడిని వెక్కిరించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాను నియమించడంతో అతడిపై రోహిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే స్టేడియంలో హార్దిక్ పాండ్యను అనరాని మాటలు అన్నారు. సోషల్ మీడియాలో సైతం అతడిపై ట్రొల్స్ చేశారు. హార్దిక్ ను హేళన చేస్తూ తీవ్ర మనస్థాపానికి గురి చేశారు.
అయినా అతడు ఎక్కడా నోరు జారలేదు. తన ఆట తీరుతో వారందరికీ బుద్ధి చెప్పాడు. టీమిండియాలో తాను ఎలాంటి కీలక ఆటగాడో తెలియజేశాడు. విమర్శించిన వారే మళ్లీ ప్రశంసించేలా అతడు ఎదిగాడు. ఇలా ఒక్క ఏడాదిలోనే రెండు దశలను చూసిన పాండ్యా జీవితాన్ని కచ్చితంగా బయోపిక్ లేదా డాక్యుమెంట్ తీయొచ్చు అని భారత మాజిక్ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎంత బాధ కలిగినా దాన్ని తనలోనే దాచుకున్నాడని అతడు తెలిపాడు.
బయట ఎంతోమంది అతడిని విమర్శించినా.. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూ.. ఎవరు ఊహించని విధంగా సత్తా చాటి కంబ్యాక్ అయ్యాడని పాండ్యా ను కొనియాడాడు. అతడు ప్రయాణం కొద్ది రోజులు చాలా దారుణంగా ఉండేదని.. అతడు ప్రేక్షకుల నుంచి ఎన్నో హేళనలు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. సోషల్ మీడియాలో సైతం పాండ్యాను చాలా తక్కువగా చేసి రచ్చ రచ్చ చేశారని తెలిపాడు.
ఎవరికి నచ్చినట్టు వారు అతడిపై ఇష్టం వచ్చినట్లు రాసేసారని.. అయినా అతడు ఎక్కడా బాధపడకుండా,ఎన్ని అవమానాలు బాధించినా ముందుకు సాగాడు అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. అతడిని పక్కన పెట్టిన పర్వాలేదు కానీ అవమానించడం మాత్రం సరైనది కాదు అని అన్నాడు. ఆ సమయంలో అతడు ఎంతో మానసిక శోభ అనుభవించి ఉంటాడని.. కానీ తన గుండెను నిబ్బరం చేసుకొని టి20 ప్రపంచ కప్ లో సత్తా చాటాడని పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ అండ్ డేంజరస్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ను అవుట్ చేసి టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు.
ఇక ఇది మాత్రమే కాకుండా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి దగ్గరలో ఉందన్న టైం లో హార్దిక్ అండగా నిలిచాడని గుర్తు చేశాడు. ఆసీస్ ప్లేయర్ జంపా బౌలింగ్‌లో రెండు సిక్స్ లు కొట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడని తెలిపాడు. ఒకవైపు బ్యాట్ తోను, మరోవైపు బాల్ తోనూ సింహంలా పోరాడాడు అని కొనియాడాడు. అందువల్లనే అతడిపై ఏదైనా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయాలనుకుంటే గత 7 నెలలు ఒక ఎత్తు.. అంతకు ముందు ఐపీఎల్ సమయంలో జరిగిన సంఘటనలు మరో ఎత్తు అని అన్నాడు.
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
Hardik Pandya : ఆ టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్!
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Archana Jadav: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అర్చనా జాదవ్‌పై నాలుగేళ్లు నిషేధం.. కారణమిదే!
-
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్.. నటించే ఆ స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?
-
Champions Trophy 2025: గిల్ సెంచరీ.. కానీ హార్డిక్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేంటంటే?