Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
Hardik Pandya ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పేలవంగా ఆడుతోంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో కెప్టెన్‌గా హార్దిక్ ఫెయిల్ అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. ముంబై మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

Hardik Pandya: ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ కెప్టెన్ సాధించిన ఓ అరుదైన రికార్డును హార్దిక్ పాండ్యా దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఓ హిస్టరీని ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యా్చ్‌లో హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీశాడు. మొత్తం 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్సీబీ కెప్టెన్ కుంబ్లేపైన ఉండేది. డెక్కన్ ఛార్జర్స్‌పై కుంబ్లే ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పేలవంగా ఆడుతోంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో కెప్టెన్‌గా హార్దిక్ ఫెయిల్ అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. ముంబై మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తు్న్నాయి. ఎందుకంటే చివరి ఓవర్‌లో తాను ఆడుతూ.. తిలక్‌ను రిటైర్డ్ ఔట్ చేయడమే కారణం. కెప్టెన్‌గా హార్దిక్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక తెలుగు కుర్రాడికి ఇది ఘోర అవమానమని అంటున్నారు. లక్నోపై ముంబై విజయం సాధించాలంటే 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో హార్దిక్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో తిలక్ వర్మ టైమింగ్‌ను కాస్త తడబడుతూ.. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరేలా చేసింది. అయితే ఇతని స్థానంలో వేరే బ్యాటర్ వచ్చి ఏమైనా ఆడాడా? అంటే అది లేదు. స్పిన్నర్ అయిన శాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. కానీ పెద్దగా అయితే ఆడలేదు. దీంతో తిలక్‌ను అవమానించారంటూ నెట్టింట హార్దిక్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో హార్దిక్ కూడా ఇలాంటి ఇబ్బందే పడ్డాడు. కానీ అప్పుడు హార్దిక్‌ను ఔట్ చేయలేదని, ఇప్పుడు తిలక్ వర్మను ఎందుకు ఔట్ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!