IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్

IPL 2025: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ మొదటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆరు పరుగులతో పంజాబ్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 190 పరుగులు మాత్రమే ఆర్సీబీ చేసింది. ఈ లక్ష్య ఛేదనను పంజాబ్ జట్టు సునాయసంగా కొట్టేస్తాదని అందరూ భావించారు. పంజాబ్ జట్టుతో పాటు ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ పంజాబ్ జట్టు బ్యాటింగ్ స్టార్ అయిన తర్వాత ఆర్సీబీ బౌలింగ్‌ను కట్టుదిట్టం చేసింది. పంజాబ్ కీలక వికెట్లు వరుసగా పడిపోవడంతో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. 18 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే ఈ ఐపీఎల్ 2025 టైటిల్ సాధించడానికి ఆపరేషన్ సిందూర్ కూడా ఓ కారణమట. విజయానికి బాగా కలిసి వచ్చిందని ఆర్సీబీ జట్టు ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు.
ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
ఆపరేషన్ సిందూర్ విరామం వల్ల హేజిల్‌వుడ్ కోలుకోవడానికి సమయం దొరికిందని ఆండీ ఫ్లవర్ అన్నారు. అలాగే రజత్ పాటిదార్ చేతికి తగిలిన గాయం నయం కావడానికి సమయం వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు మ్యాచ్‌లు లేకపోవడంతో గాయం తగ్గడంతో హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ సీజన్లో హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 12 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ మొత్తం 22 వికెట్లు పడగొట్టాడని, ఇది విజయానికి ప్లస్ అని ఆండీ ఫ్లవర్ అన్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పది రోజుల పాటు మ్యాచ్‌లను నిలిపివేశారు. ఈ యుద్ధం కంటిన్యూ అయి ఉంటే ఇంకా ఎక్కువ రోజులు మ్యాచ్ వాయిదా పడేది. కానీ కాల్పుల విరమణ జరగడంతో వెంటనే మ్యాచ్‌లను మళ్లీ మొదలు పెట్టారు. గాయం వల్ల ఆర్సీబీ ప్లేయర్స్ కోలుకోవచ్చు. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నింట్లో కూడా ముందు నుంచి రాణించింది. మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 18 ఏళ్ల ఆర్సీబీ ఫ్యాన్స్ కలను నెరవేర్చింది.
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli
-
Bengaluru Stampede Tragedy: మీరు మారరా.. తొక్కిసలాటపై మండిపడుతున్న నెటిజన్లు
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్