IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
IPL 2025 Final: మొదట ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభం అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 4.8 కోట్లు ప్రైజ్ మనీ కింద ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.2.4 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ ప్రైజ్ మనీ పెరిగింది.

IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్‌కు చేరాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. ఐపీఎల్ 2025 విజేతగా నిలవనున్న జట్టుకు రూ.20 కోట్లు అందుకుంటుంది. అలాగే రన్నరప్ జట్టు రూ.12.5 కోట్లు గెలుచుకుంటుంది. అయితే మొదట ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభం అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 4.8 కోట్లు ప్రైజ్ మనీ కింద ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.2.4 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ సీజన్లో ఎలిమినేటర్ దశలో నిష్క్రమించిన గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.6.5 కోట్లు అందుకుంటుంది. క్వాలిఫయర్ 2 లో నాకౌట్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు రూ.7 కోట్లు అందుకుంటుంది. అలాగే మైదానంలో ఉత్తమ స్ఫూర్తిని ప్రదర్శించే జట్టుకు రూ.10 లక్షల బహుమతితో ఫెయిర్ ప్లే అవార్డు కూడా ఇస్తారు. మరి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
ఆర్సీబీ, పంజాబ్ ఫైనల్ మ్యా్చ్కు వర్షం ముప్పు ఉంది. అయితే మ్యా్చ్ సమయంలో ఒకవేళ వర్షం పడితే.. గంటన్నర అదనపు సమయం లోగా పూర్తిగా తగ్గితే 20 ఓవర్లలో మ్యాచ్ జరిపిస్తారు. గంటన్నర కంటే ఎక్కువ సమయం వర్షం అంతరాయం ఏర్పడితే ఓవర్లను కుదిస్తారు. మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. అంటే మంగళవాం భారీ వర్షం కురిసి మ్యాచ్ సాధ్యం కాకపోతే మరుసటి రోజు (బుధవారం) నిర్వహిస్తారు. మ్యాచ్ టై అయినప్పుడు ఎప్పట్లాగే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్లో కూడా టై అయితే ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అందులో గెలిచిన టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు.
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినీస్, అజ్మతుల్లా ఒమర్జాయి, కైల్ జెమీసన్, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్/యుజ్వేంద్ర చాహల్, వైశాక్ విజయ్‌కుమార్.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..