Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
Two Mistakes That Man Makes: జీవితం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పటికీ నెగటివ్ మాయలో పడిపోయి నిరాశతో ముందుకు వెళ్తారు. అంటే చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు.

Two Mistakes That Man Makes: మనుషులు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొందరు తమ జీవితం ఎప్పుడూ కష్టాల సుఖాలతోని నిండిపోయిందని నిరాశ పడుతూ ఉంటారు. పక్క వారు బాగుపడితే తమ జీవితం ఎందుకు అలా లేదు అంటూ కృంగిపోతూ ఉంటారు. అయితే ఎవరి జీవితంలోనూ తప్పులు ప్రత్యేకంగా రావు. ఎవరికివారు సృష్టించుకున్న వాతావరణం తోనే తమ జీవితం ఆధారపడుతూ ఉంటుంది. అంటే మనుషులు చేసే తప్పులతోనే వారు కష్టాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. కొత్తగా వీరికి కష్టాలను ఎవరు ముడి పెట్టరు. అయితే మనుషులు కష్టాలను ఎలా కొనితెచ్చుకుంటారు? వారు చేసే ప్రధాన తప్పులు ఏంటి?
జీవితం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పటికీ నెగటివ్ మాయలో పడిపోయి నిరాశతో ముందుకు వెళ్తారు. అంటే చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు. ఆ తప్పుల్లో మొదటిది గతం గురించి ఆలోచించడం. అంటే ఒకప్పుడు తాము చేసిన తప్పులు లేదా పొరపాట్ల గురించి నిత్యం తలుచుకుంటూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల తమ జీవితం ఇలా మారిందని బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి జరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం దేవుడు కూడా చేయలేడు. అలాంటప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం దేనికి? అందువల్ల జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం మానివేయాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Also Read: PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
మనుషులు చేసే మరో తప్పు భవిష్యత్తు గురించి ఆలోచించడం. అంటే ఒక వ్యక్తి తనకు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది.. భవిష్యత్తులో డబ్బు లేకపోవడం వల్ల తాము జీవించలేమని.. రకరకాల కారణాలతో భయపడుతూ ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఏ పని చేయకుండా ఆందోళన చెందుతుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తు సంగతి దేవుడెరుగు.. ప్రస్తుతానికి జీవితం ముందుకు పోయే అవకాశం ఉండదు. అందువల్ల భవిష్యత్తు గురించి ఆలోచించడం మానివేయాలి. భవిష్యత్తులో జరిగేది ఎలాగో జరుగుతుంది.. అందువల్ల దాని గురించి ఆలోచించడం మానివేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Also Read: Amazon : సరికొత్త సర్వీసును ప్రారంభించిన అమెజాన్.. ఇంటి వద్దకే డయాగ్నోస్టిక్స్ సేవలు
ఈ రెండు తప్పులను మనుషులు చేయడం వల్ల ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. మరి మనుషులు ఏ విధంగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు? గతం మరిచిపోయి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానం గురించి ఆలోచించే వ్యక్తి నిజమైన సాధకుడిగా పేరందుతాడు. అంటే నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి పనులు చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఈరోజు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అనే విషయాల గురించి మాత్రమే ఆలోచించాలి. అప్పుడు వారి జీవితం అరిచేతుల్లో ఉండిపోతుంది. అంతేకాకుండా వర్తమానం గురించి ఆలోచించేవారు అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వర్తమానం పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండగలుగుతారు. అందువల్ల భవిష్యత్తు గురించి కాకుండా.. వర్తమానం గురించి మాత్రమే ఆలోచించి జీవితాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి
-
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?