Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • International News News »
  • Will America Step Into The Israel Iran War

Israel-Iran War: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వార్‌.. అమెరికా రంగంలోకి దిగుతుందా?

Israel-Iran War: ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో వారం రోజులుగా ఇజ్రాయెల్‌ను వెనక ఉండి నడిపించిన అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధరంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యంలో మోహరిస్తోందని సమాచారం. ఇరాక్, కువైట్, ఖతర్, బహ్రెయిన్‌ వంటి దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.

Israel-Iran War: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వార్‌.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on June 17, 2025 / 01:07 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Israel-Iran War: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్‌ క్షిపుణులతో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. దీంతో ఇరాన్‌ సుప్రీం కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక సైనిక అధికారిని ఇజ్రాయెల్‌ ఇప్పటికే మట్టుపెట్టింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన తాజా వైమానిక దాడులు, ఇరాన్‌ ప్రతిస్పందనలు ప్రాంతీయ యుద్ధ వాతావరణాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఈ నేపథ్యంలో, అమెరికా సైనిక పాత్రపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో వారం రోజులుగా ఇజ్రాయెల్‌ను వెనక ఉండి నడిపించిన అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధరంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యంలో మోహరిస్తోందని సమాచారం. ఇరాక్, కువైట్, ఖతర్, బహ్రెయిన్‌ వంటి దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ దాడులతో తమకు సంబంధం లేదని, అమెరికా సైనికుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ట్రంప్‌ ప్రకటన: దౌత్యం లేదా హెచ్చరిక?
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు ముందు, ట్రంప్‌ ఇరాన్‌తో అణు ఒప్పంద చర్చలను కొనసాగించాలని సూచించారు. దాడులు విపరీత పరిణామాలకు దారితీస్తాయని, ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తే శాంతియుత పరిష్కారం సాధ్యమని ఆయన అన్నారు. అయితే, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ సూచనలను పెడచెవిన పెట్టి, ఇరాన్‌ అణు స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరిస్తూ, అమెరికా లక్ష్యాలపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి

అమెరికా ఎంబసీపై దాడి..
జూన్‌ 16న టెల్‌అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్‌ క్షిపణి దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, సిబ్బందికి గాయాలు కాలేదని అమెరికా దౌత్యవేత్త మైక్‌ హకేబీ ధ్రువీకరించారు. ఈ ఘటన అమెరికా–ఇరాన్‌ సంబంధాలను మరింత దిగజార్చి, అమెరికాను యుద్ధంలోకి లాగే అవకాశాన్ని సృష్టించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్‌కు యెమెన్‌ మద్దతు..
ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌పై హౌతీలు గతంలోనూ డ్రోన్, క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో, ఈ మద్దతు యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇరాన్‌కు రష్యా, హిజ్బొల్లా వంటి సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తుండటం పరిస్థితిని సంక్లిష్టతరం చేస్తోంది.

Also Read: Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..

అమెరికా ద్వంద్వ నీతి?
అమెరికా ఒకవైపు ఇజ్రాయెల్‌కు సన్నిహిత మిత్రదేశంగా మద్దతు ప్రకటిస్తూనే, ఇరాన్‌తో దౌత్య చర్చలను కొనసాగించాలని కోరుతోంది. ట్రంప్‌ పరిపాలన ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తూనే, అణు ఒప్పందం ద్వారా శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటోంది. అయితే, ఇజ్రాయెల్‌ ఏకపక్ష చర్యలు, ఇరాన్‌ ప్రతిదాడులు అమెరికాను యుద్ధంలోకి లాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రాంతీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అమెరికా యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా, ఇజ్రాయెల్‌కు సైనిక, దౌత్య మద్దతు కొనసాగించే అవకాశం ఉంది. ఇరాన్‌తో దౌత్య చర్చలు విఫలమైతే, లేదా అమెరికా లక్ష్యాలపై దాడులు జరిగితే, పరిస్థితి మరింత ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి అసాధ్యంగా కనిపిస్తోంది.

Tag

  • American Embassy
  • Donald Trump
  • israel iran conflict
  • Israel-Iran War
  • telugu news
Related News
  • Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?

  • Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి

  • UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. లావాదేవీలపై ఇక ఛార్జీలు?

  • IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!

  • Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని

  • Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us