PM Modi: మోదీ అధ్యక్షతన హైలెవల్ భేటీ
PM Modi సమావేశం తర్వాత సుంకాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్ పై తొలుత 25 శాతం సుంకం విధించారు.

PM Modi: పీఎం మోదీ హై లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్ లపై ఎలా స్పందించాలన్న దానిపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత సుంకాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్ పై తొలుత 25 శాతం సుంకం విధించారు.
ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్ల ప్రకటించారు. ఈ ప్రభావం అనేక రంగాల మీద పడనుంది. ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఫుడ్, ఆటో రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. సుంకాలపై భారత్ తో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు ట్రంప్. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత చెడిపోతున్నట్లు కనిపిస్తోంది.
Related News
-
PM Modi: ట్రంప్ టారిఫ్ లు.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
-
PM Modi Maldives: భారత్ ను శరుణు వేడిన మాల్దీవ్స్
-
Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
-
Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!