Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?

Trump Mobile : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్‌కు (Apple) గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కంపెనీ ‘ట్రంప్ మొబైల్’ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే, దీని పూర్తిస్థాయి అమ్మకాలు ప్రారంభం కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ట్రంప్ మొబైల్ అమ్మకాలు ఐఫోన్ 17 విడుదలతో దాదాపు ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే, ట్రంప్ ఫోన్ ఐఫోన్ 17కు పోటీగా బరిలోకి దిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
సాధారణంగా ప్రతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేస్తారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటి కాబట్టి, ట్రంప్ మొబైల్ కూడా సెప్టెంబర్‌లో భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ట్రంప్ మొబైల్ భారతదేశంలోకి వస్తే అది ఏ ధరకు లాంచ్ అవుతుంది ? ఐఫోన్ 17తో పోలిస్తే ఈ ఫోన్ ఎంత చౌకగా ఉంటుందో చూద్దాం.
Read Also:Dhanush : పవన్ కళ్యాణ్ హీరోగా ధనుష్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే ?
అమెరికాలో ట్రంప్ మొబైల్‌ను 499 డాలర్లకు (సుమారు రూ.42,911) విక్రయిస్తున్నారు. ఇది ‘మేడ్ ఇన్ అమెరికా’ ఫోన్ కాబట్టి, భారతదేశం ఈ హ్యాండ్‌సెట్‌పై 25శాతం లేదా 50శాతం వరకు దిగుమతి సుంకం విధించవచ్చు. 25శాతం టారిఫ్ విధిస్తే ఫోన్ ధర మరో రూ.10,727 పెరుగుతుంది. కాబట్టి అప్పుడు మొత్తం ధర సుమారు రూ.53,638 (రూ.42,911 + రూ.10,727) ఉండే అవకాశం ఉంది. ఒక వేళ 50శాతం టారిఫ్ విధిస్తే ఫోన్ ధర దాదాపు రూ.21,455 పెరుగుతుంది. మొత్తం ధర సుమారు రూ.64,366 (రూ.42,911 + రూ.21,455) ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 భారతదేశంలో సుమారు రూ.79,999 ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ మొబైల్‌ను ఐఫోన్ 17తో పోలిస్తే ఎంత తక్కువగా ఉందో చూద్దాం. భారత ప్రభుత్వం ట్రంప్ మొబైల్‌పై 25శాతం టారిఫ్ విధించినా కూడా ఐఫోన్ 17తో పోలిస్తే ట్రంప్ ఫోన్ సుమారు రూ.26,361 (రూ.79,999 – రూ.53,638) చౌకగా లభించవచ్చు. ప్రభుత్వం ట్రంప్ మొబైల్‌పై 50శాతం టారిఫ్ విధించినట్లయితే ఐఫోన్ 17తో పోలిస్తే ట్రంప్ ఫోన్ సుమారు రూ.15,633 (రూ.79,999 – రూ.64,366) లకు తక్కువగా లభించవచ్చు.
Read Also:Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
ట్రంప్ మొబైల్ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తే మీడియం రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లో ఐఫోన్‌కు ఇది ఒక పోటీని క్రియేట్ చేయవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌పై రాజకీయంగా , సాంకేతికంగా కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్ భారతదేశంలోకి వస్తుందా, వస్తే ఏ ధరకు వస్తుంది అనేది అధికారిక ప్రకటన వరకు వేచి చూడాలి.
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!
-
Android 16 : పూర్తిగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్ లుక్..ఆండ్రాయిడ్ 16 బీటా వచ్చేసింది!
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
iPhone 17 : ఐఫోన్ 17 ప్రో లీక్డ్ డిజైన్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి