Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టి నుంచి కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసల విషయంలో అన్ని కూడా కఠినతరం చేశారు. ముఖ్యంగా వీసా నిబంధనలు మార్చి.. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తున్నారు.

Call from America: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టి నుంచి కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసల విషయంలో అన్ని కూడా కఠినతరం చేశారు. ముఖ్యంగా వీసా నిబంధనలు మార్చి.. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తున్నారు. అన్ని విధాలుగా రూల్స్ మార్చడంతో అమెరికా వెళ్లాలంటే కొందరు భయపడుతున్నారు. అమెరికా నుంచి పిలుపు వస్తున్నా కూడా మిగతా దేశాలకు వెళ్లడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు యువతకు అమెరికాలో చదివి ఉద్యోగం సాధించి అక్కడే ఉండాలనే కల ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ మార్పుల వల్ల చాలా మంది ఈ కలను చంపుకున్నారు. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో పాటు ట్రంప్ పాలనలో అక్రమ వలసలపై కఠిన విధానాల వల్ల విద్యార్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే ఈ ఏడాది అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల సంఖ్య కూడా 50 నుంచి 60 శాతం వరకు తగ్గవచ్చని టాక్ వినిపిస్తోంది. కఠిన నిబంధనల వల్ల విద్యార్థులు యూకే, కెనడా వంటి దేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. లేకపోతే దేశంలోనే టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.
Read Also: రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడేనా?
అమెరికా రాజకీయ పరిస్థితుల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది నిరుద్యోగ రేటు కూడా 4.2%కి చేరింది. అలాగే టెక్ రంగంలో లే ఆఫ్‌లు భారీగా జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో వంటి కంపెనీల్లో దాదాపుగా 10,000కి పైగా ఉద్యోగాలను తొలగించారు. వీటితో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు 20% తగ్గాయి. అమెరికాలో గంటకు 12–15 డాలర్ల ఆదాయం సాధారణమే. కానీ వీటికి పోటీ తీవ్రంగా పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యంగా వీసా ప్రక్రియ అయితే కఠినం అయ్యింది. ప్రస్తుతం ఐటీ రంగంలో కూడా పోటీ భారీగా పెరిగింది. ఎంఎస్ పూర్తి చేసిన వారికి టెక్, డేటా సైన్స్, ఏఐ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎంట్రీ లెవెల్‌లో ఉన్న ఉద్యోగాలకు పోటీ గట్టిగానే ఉంది.
Read Also: పెద్ది’ మూవీతో రామ్ చరణ్, బుచ్చి బాబు ఆశలన్నీ ఈ సినిమాపైనే!
ఈ ఏడాది ఎచ్–1బీ వీసా కోటాలో 85,000 మాత్రమే ఉండగా, దరఖాస్తులు మాత్రం 2,00,000 దాటాయి. స్టెమ్ గ్రాడ్యుయేట్‌లకు ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది 3 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి నగరాల్లో అయితే జీవన వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల విద్యా్ర్థులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అమెరికా కంటే యూకే, కెనడాలో తక్కువగా ఫీజులు ఉండటంతో విద్యార్థులు ఇక్కడికి వెళ్లడానికి మక్కువ చూపిస్తున్నారు. అలాగే దేశంలో కూడా ఐఐటీలు, ఐఐఎంలు కూడా మంచి అవకాశాలను ఇస్తున్నాయి. అయితే అమెరికాలో చదువు ఈ సమయంలో కాస్త కష్టమే. కానీ సరైన ప్రణాళిక, నైపుణ్యాలు ఉంటే తప్పకుండా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే అమెరికాలో చదువు కాస్త సవాళ్లతో కూడుకున్నది.
-
Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
APAAR ID : విద్యార్థులందరికీ ఒకే ఐడీ.. APAAR ID అంటే ఏంటి? ఎలా పొందాలి?
-
Richest Flight: ఓర్నీ.. ఈ గబ్బిలాల విమానం ఖరీదు రూ.16 వేల కోట్లా!
-
Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?