Richest Flight: ఓర్నీ.. ఈ గబ్బిలాల విమానం ఖరీదు రూ.16 వేల కోట్లా!

Richest Flight: ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన విమానం గబ్బిలాన్ని పోలిన B-2 బాంబర్. అమెరికా తయారు చేసిన ఈ విమానంతో అణుబాంబులు సహా శక్తివంతమైన పేలుడు ఆయుధాలను కూడా ధ్వంసం చేయగలదు. అయితే ఈ విమానం ఖరీదు రూ.16 వేల కోట్లు. అసలు ఎందుకు ఈ విమాన ఖరీదు ఎక్కువగా ఉంది? దీని స్పెషాలిటీ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
B-2 బాంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానంగా మారడానికి కారణం ఫ్లయింగ్ వింగ్ డిజైన్. ఈ డిజైన్ అసలు రాడార్‌కు కనిపించదు. దీంతో శత్రువులపై దాడులు చేస్తుంది. రాడార్ నుంచి సిగ్నల్స్ కూడా కేంద్రానికి వెళ్లవు. అసలు ఈ విమాన జాడను గుర్తించలేకపోవడం వల్ల దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల శత్రుదేశాలను ఈజీగా నాశనం చేయగలదు. అయితే దీనిని తయారు చేయడానికి కూడా ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఒక్కో బాంబర్ తయారీకి దాదాపుగా రెండు బిలియన్లు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ఖరీదు రూ.16 వేల కోట్లు. ఈ యుద్ధ విమానమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానంగా గుర్తింపు పొందింది. అయితే ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని అమెరికా సృష్టించింది. దీన్ని అమెరికా 1980లలో అభివృద్ధి చేసింది. అయితే మొదటి విమానంను 1989లో అమెరికన్ వాయుసేనకు ఇచ్చారు. నార్త్‌రోప్ గ్రూమ్మాన్ కంపెనీ ఈ విమానాలను అభివృద్ధి చేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 21 బాంబర్లను మాత్రమే తయారు చేసింది. దీన్ని మొదటగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బాంబర్‌తో ప్రారంభించారు. అయితే కోల్డ్ వార్ జరిగినప్పుడు అమెరికా ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసింది. సోవియట్ యూనియన్‌పై అనుబాంబుల వర్షం కురిపించేందుకు అమెరికా దీన్ని స్టార్ట్ చేసింది.
కొన్నేళ్ల పాటు వీటిని రహస్యంగా అభివృద్ధి చేసి ఆ తర్వాత 1997లో వినియోగంలోకి తీసుకొచ్చారు. కోసోవో యుద్ధం (1999), ఆఫ్ఘనిస్తాన్ (2001), ఇరాక్ యుద్ధం (2003) యుద్ధాల్లో ఇది ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి ఫ్యూయల్ ఒకసారి నింపితే దాదాపుగా 11,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇన్‌ఫ్లైట్ రీఫ్యుయలింగ్‌తో అయితే ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది. అయితే ఆ విమానం గంటకు 1010 కి.మీల వేగంతో వెళ్తుంది. ఇది మొత్తం 20 టన్నుల ఆయుధాలను కూడా మోయగలదు. దీన్ని ఇద్దరు పైలట్లు వాడగలరు. ఈ విమానం భూమి లోపల ఉన్న లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Traffic Challan : చలాన్ల నుంచి తప్పించుకోవాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యాప్‌లు ఆన్ చేయండి
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Electric Vehicle Battery : తక్కువ ఖర్చు.. ఎక్కువ దూరం.. బ్యాటరీ టెక్నాలజీలో గేమ్ ఛేంజర్
-
Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్