Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్

Indiana Bell: ఈ ప్రపంచంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అందులో ఇండియానా బెల్ బిల్డింగ్ ఒకటి. ఒక బిల్డింగ్‌ను ఎంత గట్టిగా కట్టినా కూడా దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మార్చాలంటే చాలా కష్టం. నిజం చెప్పాలంటే అసలు ఇది జరగని పని. ఎందుకంటే బిల్డింగ్‌ను పునాదుల నుంచి కడతారు. ఇవి భూమి లోపల ఉంటాయి. వీటి నుంచి బిల్డింగ్‌ను జరపలేరు. అవసరం అయితే దాన్ని ధ్వంసం చేయాలి. అయితే ఇంజినీర్లు ఓ ఎనిమిది అంతస్తుల భవనాన్ని ఈజీగా జరిపారు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
అమెరికాలోని ఇండియానా నగరంలో ఇండియానా బెల్‌ను 1884లో నిర్మించారు. అయితే దీన్ని 1929లో సెంట్రల్ యూనియన్ టెలిఫోన్ కంపెనీ కొనుగోలు చేసింది. పాతగా ఉన్న బిల్డింగ్ కాకుండా పెద్దగా కార్యాలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బిల్డింగ్ కూల్చాలని అనుకున్నారు. కానీ దీన్ని కూల్చలేకపోయారు. ఈ క్రమంలోనే భవనం స్థానాన్ని మార్చాలని ప్లాన్ చేశారు. ఇంజినీర్ల చరిత్రలో ఇది ఒక అద్భుతమే. ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనం స్థానం మార్చడం కూడా అంత ఈజీ కాదు. ఈ భవనం మొత్తం 11,000 టన్నుల బరువు ఉంది. దీని స్థానాన్ని మార్చాలంటే కష్టమే. అయినా కూడా ఇంజినీర్లు మిరాకిల్ చేశారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
1930లో ఇండియానా బెల్‌ను 90 డిగ్రీల వరకు ఇంజినీర్లు జరిపారు.16 మీటర్లు దక్షిణానికి మార్చడం, తర్వాత 30 డిగ్రీలు తిప్పడం, ఆపై మళ్లీ 30 మీటర్లు పశ్చిమానికి మార్చారు. ఈ బిల్డింగ్ మార్చడానికి దాదాపుగా 34 రోజుల సమయం పట్టిందట. ఈ భవనాన్ని తరలించడానికి ఉపయోగించే శక్తిని ఆవిరి యంత్రం సహాయంతో చేతితో పనిచేసే జాక్‌ల ద్వారా మార్చారు. ఒరెగాన్ ఫిర్ కలపతో మృదువుగా చేసిన హైడ్రాలిక్ జాక్‌లు, రోలర్‌లతో స్పష్టమైన మ్యాట్‌ను ఉపయోగించి బిల్డింగ్‌ను మార్చారు.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
నిర్మాణ కార్మికులు చేతితో పనిచేసే జాక్‌లను ఉపయోగించారు. హ్యాండిల్స్‌ను కేవలం ముప్పై సెకన్లలో ఆరుసార్లు 90 డిగ్రీల ఆర్క్ ద్వారా తిప్పారు. అయితే భవనాన్ని మార్చేటప్పుడు వాటికి ఉన్న యుటిలిటీ కేబుల్స్, పైపులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేశారు. అయితే ఈ భవనం కదిలిస్తున్నప్పుడు అందులో 600 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ భవనం కదిలినట్లు కూడా ఎవరికీ తెలియదు. భవనాన్ని జరిపిన తర్వాత ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు. అయితే ఈ భవనాన్ని తర్వాత కంటిన్యూ చేయలేదు. 1950 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత 1963లో దానిని కూల్చివేసి వ్యాపారం కోసం కొత్త బిల్డింగ్‌ను నిర్మించారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Richest Flight: ఓర్నీ.. ఈ గబ్బిలాల విమానం ఖరీదు రూ.16 వేల కోట్లా!
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Mothers Day: కొత్తగా ఈ గిఫ్ట్‌లు ఇస్తూ.. తల్లి ప్రేమను చాటుకోండిలా!
-
Mother’s Day: అమ్మకు ప్రేమతో.. అసలు మదర్స్ డే ఎలా వచ్చింది?
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్