Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేస్తున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వీసా విషయంలో మార్పులు తీసుకొచ్చారు.

Trump Warns: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేస్తున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వీసా విషయంలో మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత సుంకాల విషయంలో మార్పులు చేశారు. కొన్ని దేశాలపై అధికంగా సుంకం విధించారు. అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై మరో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూల్ ప్రకారం.. అమెరికాలో 30 రోజుల కంటే ఎక్కువగా విదేశీ పౌరులు ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ కొత్త రూల్ ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు అందరూ కూడా 30 రోజుల్లోగా వేలిముద్రలు ఇవ్వాలి. ఇలా చేయకపోతే మాత్రం కచ్చితంగా జరిమానా చెల్లించాలి. అలాగే కొన్నిసార్లు అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
Read Also: ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
కొన్ని సందర్భాల్లో వారిని అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడే అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోతే మంచిదని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే మాత్రం ఇప్పుడే అమెరికాలో సంపాదించిన డబ్బు తీసుకుని వదిలి వెళ్లిపోవడం బెటర్ అని అంటున్నారు. అయితే విమాన ఖర్చులు భరించలేకపోతే మాత్రం వాటికి రాయితీ కూడా ఇస్తామన్నారు. అమెరికా నుంచి వెళ్లిపోవాలని అనుకుంటే.. ఇప్పుడే వదిలి వెళ్లిపోండని తెలిపారు. అలాగే హెచ్1 బీ వీసాపై వచ్చి ఉంటే.. వాటి సమయం అయిపోతే వెళ్లిపోవాలి. లేకపోతే వీరిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపింది.
Read Also: గిల్టీ నగలు పాడవుకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
ఇదిలా ఉండగా ఇటీవల ట్రంప్ ఓ రూల్‌ను ప్రకటించారు. అమెరికాలో ఇండియన్స్ చాలా మంది ఉంటున్నారు. అయితే వీరిలో వివిధ కేటగిరీల్లో కార్డులు ఉంటాయి. కొందరికి వీసాలు, గ్రీన్ కార్డులు ఉంటాయి. అయితే వీటిని బయటకు వెళ్లినప్పుడు ఎవరూ తీసుకెళ్లరు. కానీ ఇకపై ఇండియన్స్ మాత్రం బయటకు వెళ్లి్నా కూడా తమ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. అయితే కేవలం కేవలం భారతీయులు మాత్రమే కాకుండా అమెరికన్లు కూడా పత్రాలను బయటకు తీసుకెళ్లాలి. పిల్లల వయస్సు 14 ఏళ్లు కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వారు వేలిముద్రలు సమర్పించి, తప్పకుండా రీ రిజిస్టర్ చేసుకోవాలని రూల్ తీసుకొచ్చారు. ఈ న్యూ రూల్ వల్ల అమెరికాలో ఉంటున్న వలసదారులు అడిగిన ప్రతీసారి కూడా పత్రాలు సమర్పించాలి.18 ఏళ్లు కంటే ఎక్కువ ఉన్నవారు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. అయితే ఈ నిబంధనలు ఎవరైనా పాటించకపోతే మాత్రం వారికి అమెరికాలో ఉండే అర్హత లేదని తెలిపింది. అయితే ఈ కొత్త రూల్‌ను పాటించకపోతే మాత్రం జైలు శిక్ష కూడా ఉంటుందని తెలిపింది.
-
Gautam Gambhir: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
-
Cancellation: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
-
Cow dung: ఆవు పేడతో కోట్లలో బిజినెస్.. విదేశాల్లో ఎందుకింత డిమాండ్
-
Beautiful countries: తక్కువ బడ్జెట్లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?