Mother’s Day: అమ్మకు ప్రేమతో.. అసలు మదర్స్ డే ఎలా వచ్చింది?

Mother’s Day: ఎలాంటి కల్మషం లేని ప్రేమ అమ్మది. కష్టాలు పడుతూ నవమాసాలు మోసి.. బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పురిటి నొప్పులను కూడా దాచుకుని.. బిడ్డ కొత్త ప్రపంచాన్ని చూస్తే.. తల్లి నవ్వుతూ స్వాగతిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తల్లి పిల్లలను వదిలేయదు. కాకి, కుక్క, పక్షి ఇలా ప్రతీ జంతువు కూడా బిడ్డలను కష్టపెట్టకుండా ప్రేమగా పెంచుకుంటుంది. తల్లి తన ఇష్టాలను వదిలి మరి పిల్లలను చూసుకుంటుంది. ఒక పూట పస్తులు ఉండి అయినా.. పిల్లలు ఆకలితో ఉండకుండా చూసుకుంటుంది. పిల్లలనే సరస్వంగా తల్లి ప్రేమిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేకుండా దొరికే ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి తల్లులు అందరికీ కూడా గుర్తింపు ఇచ్చేందుకు ప్రతీ ఏటా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతీ ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మే 11వ తేదీన మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎంతో ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే అసలు మదర్స్ డే ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి దీన్ని జరుపుకుంటున్నారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
తొలిసారిగా మాతృ దినోత్సవాన్ని 1908లో అమెరికాలో నిర్వహించారు. మదర్స్ డేను అన్నా జార్విస్ అనే ఒక మహిళ ప్రారంభించింది. 1905 సమయంలో అన్నా జార్వి్స్ తల్లి మరణించింది. తల్లి ప్రేమను మరిచిపోలేక ఆమె బాధపడేది. ఈ క్రమంలో ఆమెకు మదర్స్ డే జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. తన తల్లిలాంటి వాళ్లు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారి కష్టాన్ని, ప్రేమను గుర్తించేందుకు ప్రతీ ఏడాది మాతృ దినోత్సవాన్ని జరుపుకోవాలని భావించింది. ఇలా 1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్ నగరంలో ఫస్ట్ టైం మదర్స్ డేను ఘనంగా ఆమె నిర్వహించింది. ఈ సమయంలో కొందరు మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఇది అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. అయితే 1914 సమయంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మదర్స్ డేను నిర్వహించడానికి ప్లాన్ చేశారు.
ఏడాదిలో ఏ రోజు నిర్వహించాలని ఆలోచించి మే నెలలో వచ్చే రెండో ఆదివారం అని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తెలిపారు. అయితే 1914లో మే8న మదర్స్ డే జరుపుకున్నారు. ఇలా అప్పటి నుంచి మదర్స్ డేను ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రస్తుతం ఈ పండుగను 46 దేశాల్లో జరుపుకుంటున్నారు. మదర్స్ డే రోజున తల్లికి గౌరవం ఇస్తూ.. విషెష్ తెలియజేస్తారు. మదర్స్ ఎప్పుడూ కూడా ఇంటి పని అని కష్టపడుతుంటారు. ఏడాదిలో ఒక్కరోజు కూడా వారికి తీరిక ఉండదు. అలాగే వారి ఇష్టాలను కూడా చంపుకుని ఉంటారు. ఈ మదర్స్ డే రోజున తల్లులకు ఇష్టమైన వాటిని ఇస్తారు. వారికి ఇష్టమైన వాటిని బహుమతులుగా ఇవ్వడం, నచ్చిన వంటకం చేసి ఇవ్వడం, ఆ ఒక్క రోజు ఎలాంటి పనులు చేయకుండా ఉంచడం వంటివి చేస్తారు. మదర్స్ డే రోజున వారిని సంతోష పరుస్తారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్
-
Mothers Day: కొత్తగా ఈ గిఫ్ట్‌లు ఇస్తూ.. తల్లి ప్రేమను చాటుకోండిలా!
-
Mother’s Day : మదర్స్ డే.. అమ్మలను ఇలా మెప్పించండి
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?