Father’s Day: ఫాదర్స్ డే ఎలా వచ్చింది? ఆదివారమే ఎందుకు?

Father’s Day: జూన్ మూడో ఆదివారం ప్రతీ ఏడాది ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఎంతో సంతోషంగా నాన్నను గుర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫాదర్స్ డే జరుపుకుంటారు. కుటుంబానికి పెద్దగా ఉండే నాన్న.. ఎంత చేసినా కనిపించదు. నాన్న ప్రేమ, బాధ్యత, కష్టాలు అన్ని కూడా ఎప్పుడూ వెనుక ఉంటాయి. ఆఖరికి పిల్లల సక్సె్స్‌కి కారణం అయినా నాన్న చివరకు ఉండిపోతారు. అయితే సాధారణంగా నాన్నకు కూతురు అంటే ఇష్టం. అలాగే ఆడపిల్లలకు నాన్నకు మంచి బాండింగ్ ఉంటుంది. అయితే ఈ ఫాదర్స్ డే కూడా ఓ కూతురు వల్లే వచ్చిందనే విషయం మీకు తెలుసా?
కూతుర్లు ఎంత ఎత్తుకు ఎదిగినా తండ్రికి చిన్నపిల్లలే, యువరాణులే. కేవలం తండ్రులకే కాదు, కూతుర్లకు మొదటి హీరో తండ్రే.. అయితే సొనోరా స్మార్ట్ డాడ్ అనే అమ్మాయి తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ కోసం ఈ వేడుకను ప్రారంభించింది. అలా మొట్టమొదటగా పితృ దినోత్సవాన్ని యూఎస్‌లో జరుపుకున్నారు. విలియం జాక్సన్ స్మార్ట్ ఒక సైనికుడు. సొనోరా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దీంతో ఆరుగురు బిడ్డలను తన తండ్రి కంటికి రెప్పలా చూసి పెంచాడు. అందుకే తమ కోసం అంతగా కష్టపడిన నాన్న కోసం సొనోరా ఏదైనా చేయాలని నిర్ణయించుకుందట. అప్పుడే అనా జార్విస్ మాతృ దినోత్సవాన్ని జరుపుతున్న విషయం తెలుసుకుంది. ఈ క్రమంలోనే బిడ్డల కోసం పరితపించే నాన్నలను, అలాగే తండ్రి స్థానంలో ఉండి బాగోగులు చూసుకున్న మగవాళ్లందరి గౌరవార్థం తాను ‘ఫాదర్స్ డే’ జరపాలని సొనోరా నిర్ణయించుకుంది.
సొనోరా తన తండ్రి విలియం పుట్టినరోజు అయిన జూన్ 5వ తేదీన ఈ వేడుకను నిర్వహించాలని తమ చర్చి పాస్టర్‌కు సూచించింది. కానీ ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని జూన్ మూడో ఆదివారానికి మార్చారట. అలా 1910లో జూన్‌లో మూడో ఆదివారం అయిన 19వ తేదీన తొలి ఫాదర్స్ డే చేసుకున్నారట. అయితే మొదట్లో దీనికి అంతగా ప్రాచుర్యం లభించలేదట. ఈ క్రమంలోనే సొనోరా దేశమంతా ఫాదర్స్ డే గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అందరికీ తెలిసేలా కృషి చేసింది. ఆమె పట్టుదల, కృషి ఫలితంగా క్రమంగా ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకోవడం ప్రారంభించారు. చివరికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఈ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించారట. ఈ విధంగా ఒక కూతురు తన తండ్రి పట్ల చూపిన ప్రేమ, కృతజ్ఞతకు నిదర్శనంగా ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకునే ఒక ముఖ్యమైన వేడుకగా మారింది. నాన్నల త్యాగాలను, ప్రేమను గుర్తు చేసుకుంటూ, వారికి మన కృతజ్ఞతను తెలియజేసే గొప్ప అవకాశం ఈ ఫాదర్స్ డే.
ఇది కూడా చూడండి: Kannappa trailer: కన్నప్ప ట్రైలర్.. అంచనాలకు మించి ఉందా?
-
Allu Arjun : ఫాదర్స్ డే సర్ప్రైజ్.. పిల్లల గిఫ్ట్‌కు భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్!
-
Father’s Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకి ఈ గిఫ్ట్ ఇచ్చి చూడండి
-
Mothers Day: కొత్తగా ఈ గిఫ్ట్‌లు ఇస్తూ.. తల్లి ప్రేమను చాటుకోండిలా!
-
Mother’s Day: అమ్మకు ప్రేమతో.. అసలు మదర్స్ డే ఎలా వచ్చింది?
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?