Father’s Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకి ఈ గిఫ్ట్ ఇచ్చి చూడండి

Father’s Day: ప్రతీ ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. అయితే చాలా మంది ఈ ఫాదర్స్ డే రోజు తల్లిదండ్రులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. దుస్తులు, గ్యాడ్జెట్‌లు, ఇతర వస్తువులు వస్తువులు వంటివి గిఫ్ట్‌గా ఇస్తారు. అయితే ఇలా కాకుండా తండ్రులకు కొత్తగా గిఫ్ట్‌లు ఇచ్చి చూడండి. ఫాదర్స్ డే రోజు తండ్రులకు కొత్తగా ఇవ్వాల్సిన గిఫ్ట్‌లు ఏంటో మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా అనేది నేటి కాలంలో తప్పకుండా ఉండాలి. వయస్సు పెరిగిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులు అధికంగా ఉన్నాయి. అదే మీ ఫాదర్‌కి మంచి ఆరోగ్య బీమా పాలసీ గిఫ్ట్‌గా ఇస్తే మాత్రం బాగుంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు వంటి వాటిని బీమా కంపెనీ భరిస్తుంది. మీ ఫాదర్ వైద్య చికిత్స ఖర్చుల కోసం ఎలాంటి ఆందోళన కూడా ఉండదు.
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్
మీ నాన్నకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ బహుమతి ఇవ్వడం మంచిది. ఇది బెస్ట్ కవరేజ్‌ను అందిస్తుంది. దురదృష్టవశాత్తు, పాలసీదారుడు మరణిస్తే, నామినీలకు ఒక పెద్ద మొత్తంలో బీమా డబ్బు అందుతుంది. ఇది కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా నాన్నపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు భవిష్యత్తు భద్రత కలుగుతుంది.
వ్యక్తిగత ప్రమాద బీమా
వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ప్రమాదాలు జరగొచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ, ప్రమాదం కారణంగా సంభవించే గాయాలు, వైకల్యం లేదా మరణానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. వైద్య ఖర్చులు, పునరావాస ఖర్చులు, ఆదాయ నష్టాన్ని భరిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ బీమా
గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు రావచ్చు. ఇవి వస్తే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఈ క్రిటికల్ ఇల్‌నెస్ బీమా పాలసీ బాగా ఉపయోగపడుతుంది. వ్యాధి బారిన పడినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది. ఈ డబ్బును వైద్య చికిత్సల కోసం, లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది సాధారణ ఆరోగ్య బీమా కవరేజీకి అదనంగా ఒక రక్షణ కవచం లాంటిది.
రిటైర్‌మెంట్ ప్లాన్
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడతారు. అయితే తండ్రి పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా జీవించడానికి పెన్షన్ ప్లాన్ బాగా సహాయపడుతుంది. ఫాదర్స్‌కు ఇలాంటి బహుమతులు ఇవ్వడం వల్ల వారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు.
ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?