Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?

Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ మృతి చెందారు. అయితే నోటిలో తేనెటీగ కుట్టడం వల్ల గుండెపోటు వచ్చిందని వైద్యులు తాజాగా తెలిపారు. తేనెటీగ శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరాడక చనిపోవడం, లేదా తేనెటీగ విషానికి తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య రావడం వల్ల మృతి చెందారని వైద్య నిపుణులు తెలిపారు. తేనెటీగ శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే, ఒక్కసారిగా గాలి పూర్తిగా అడ్డుకుని ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేనెటీగ ఇలా శ్వాస లోకి వెళ్లడం వల్ల గుండె సమస్యలు లేని వారికి కూడా గుండె పోటు వస్తుందని అంటున్నారు. తేనెటీగ వెళ్లినప్పుడు ఆక్సిజన్ లేకపోవడం వల్ల గుండెకు తీవ్రమైన ఒత్తిడి రావడంతో గుండెపోటు వస్తుందని చెబుతున్నారు.
తేనెటీగ నోటిలో లేదా గొంతులో తేనెటీగ కుట్టడం వల్ల తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య వస్తుంది. తేనెటీగ విషం వల్ల కొంతమంది వ్యక్తులలో శరీరం అతిగా డిఫరెంట్‌గా స్పందిస్తుంది. దీనిని అనాఫిలాక్సిస్ అంటారు. ఈ పరిస్థితిలో గొంతు, శ్వాసనాళాలు ఉబ్బిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాగే రక్తపోటు పూర్తిగా తగ్గిపోతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య గుండెపోటుకు దారితీస్తుంది. తేనెటీగ కుట్టడం వల్ల కలిగే అలెర్జీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపి, గుండెకు రక్త సరఫరాను తగ్గుతుంది. అలాగే గుండె కండరాలకు నష్టం కలిగి గుండెపోటుకు దారితీయవచ్చు. నోటిలో లేదా గొంతులో తేనెటీగ కుట్టడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాపు చాలా వేగంగా వచ్చి, శ్వాస మార్గాన్ని పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంటుంది. తేనెటీగ కుట్టిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా గొంతు వాపు, శరీరంపై దద్దుర్లు లేదా దురద, కళ్లు తిరగడం లేదా స్పృహ కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట