Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
Vastu Tips కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ప్లాటినం కూడా కొనుగోలు చేయవచ్చని పండితులు అంటున్నారు. కొందరు శనివారం మంచిదని ఆ రోజున బంగారం కొంటారు. అసలు శనివారం రోజు బంగారం కొనకూడదని పండితులు చెబుతున్నారు.

Vastu Tips: బంగారం అంటే ప్రస్తుతం రోజుల్లో చాలా విలువైనది. మహిళలకు అయితే బంగారం అంటే మక్కువ. దీంతో ఎప్పటికప్పుడు బంగారు ఆభరణాలు కొంటుంటారు. సాధారణంగానే బంగారం ధరలు ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ ఇప్పుడు అయితే తులం లక్ష పైనే ఉంది. అయినా ఈ సమయంలో కూడా మహిళలు బంగారు ఆభరణాలు కొంటూనే ఉంటారు. బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఎవరికైనా బంగారం ఇస్తే వారాలు చూసుకుంటారు. అలాగే బంగారం కొనుగోలు చేసేటప్పుడు కూడా వారాలు చూసుకోవాలని పండితులు అంటున్నారు. బంగారం మంచి రోజు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అయితే ఏయే వారాల్లో బంగారం కొనుగోలు చేస్తే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
బంగారాన్ని పుష్య నక్షత్రం ఉన్న సమయంలో కొనుగోలు చేయాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అలాగే వారాల పరంగా చూసుకుంటే బంగారం ఆదివారం కొంటే మంచిది. ఎందుకంటే ఆదివారం రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్యరశ్మి వల్ల ఎనర్జీ పెరుగుతుంది. అలాగే బంగారం కూడా రెట్టింపు అవుతుందని అంటున్నారు. అలాగే మంగళవారం కూడా బంగారం కొనుగోలు చేయడం మంచిదేనట. కానీ మంగళవారం కాస్త నెగిటివ్గా ఆలోచించి చాలా మంది మంగళవారం కొనడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే బంగారాన్ని గురువారం కొనడం కూడా మంచిదే. ముఖ్యంగా బంగారం పెట్టుబడులు పెడితే ఇంకా మంచిది. గురువారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. దీంతో గురువారం రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే కేవలం బంగారం అనే కాకుండా వెండి కూడా గురువారం రోజు ఇంటికి తీసుకొస్తే మంచిది. మీరు ఇంకా ఎక్కువ సార్లు బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే సోమవారం రోజు కూడా బంగారం కొనడం మంచిదే. ఈ రోజున చంద్రుని పూజిస్తారు. శాంతికి, సౌభాగ్యానికి సూచికగా చూసే సోమవారం రోజు బంగారం కొంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ప్లాటినం కూడా కొనుగోలు చేయవచ్చని పండితులు అంటున్నారు. కొందరు శనివారం మంచిదని ఆ రోజున బంగారం కొంటారు. అసలు శనివారం రోజు బంగారం కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున బంగారం కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. అందుకే శనివారం అసలు బంగారం కొనవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?