Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Gold Prices Soar Again Nearing Rs 1 Lakh Mark

Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!

Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!
  • Edited By: rocky,
  • Updated on June 2, 2025 / 08:06 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Gold Price : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్టీల్ అల్యూమినియం దిగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఈ టారిఫ్‌ల ప్రకటనతో పెట్టుబడిదారులలో మరోసారి ఆందోళన మొదలైంది. ఈ భయం కారణంగానే బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం. దీని వల్ల దేశంలో బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల మార్కుకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో పెరిగిన బంగారం, వెండి ధరలు
సోమవారం మార్కెట్లో బంగారం ధర రూ. 330 పెరిగి 10 గ్రాములకు రూ. 98,930కి చేరుకుంది. అంతకుముందు శుక్రవారం, 99.9శాతం ప్యూరిటీ బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,600 వద్ద ముగిసింది. అలాగే, 99.5శాతం ప్యూరిటీ గల బంగారం ధర రూ. 300 పెరిగి 10 గ్రాములకు రూ. 98,400కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో ఇది 10 గ్రాములకు రూ. 98,100 వద్ద ముగిసింది. అదనంగా, వెండి ధర రూ. 100 పెరిగి కిలోకు రూ. 1,00,100కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది.

Read Also:Online Chatting : ‘Hmm’, ‘K’ అని రిప్లై ఇస్తున్నారా? అయితే తెలియకుండానే వాళ్ళని బాధపెడుతున్నారు!

విదేశీ మార్కెట్లలోనూ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 59.21 డాలర్లు అంటే 1.80శాతం రిగి ఔన్స్‌కు 3,348.61 డాలర్లకు చేరుకుంది. అబన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ CEO చింతన్ మెహతా మాట్లాడుతూ, “అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్ మరియు అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచే ప్రణాళికను ప్రకటించిన తర్వాత పెరిగిన అనిశ్చితి మధ్య బంగారం ధరలు పెరిగాయి. ఈ సుంకం జూన్ 4 నుంచి అమలులోకి వస్తుంది” అని అన్నారు. భౌగోళిక రాజకీయ పరంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న సంఘర్షణ కూడా బంగారం ధరలను పెంచాయని మెహతా తెలిపారు.

ఇంకా పెరిగే అవకాశం
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్-కమోడిటీ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. “అమెరికా మే నెల ISM మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) నివేదికను పెట్టుబడిదారులు ట్రాక్ చేస్తారు. ఇది నేడు విడుదల కానుంది” అని అన్నారు. కమోడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం.. వ్యాపారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్ ద్రవ్య విధానంలో పావెల్ వ్యాఖ్యలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. బంగారం ధరలు ప్రస్తుతానికి పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also:Viral Video : రోడ్డుపై స్కేటింగ్.. ఎదురుగా గేదెల మంద.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

Tag

  • Donald Trump
  • Gold
  • gold prices
  • Indian Gold
  • International Market
Related News
  • Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

  • Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?

  • Israel-Iran War: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వార్‌.. అమెరికా రంగంలోకి దిగుతుందా?

  • Gold: కుప్పలు తెప్పలుగా పుడుతున్న బంగారం.. సైంటిస్టులు ఏమన్నారంటే?

  • Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు

  • Donald Trump : సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే

Latest Photo Gallery
  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us