Online Chatting : ‘Hmm’, ‘K’ అని రిప్లై ఇస్తున్నారా? అయితే తెలియకుండానే వాళ్ళని బాధపెడుతున్నారు!

Online Chatting : ఈ స్మార్ట్ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాటింగ్ ఒక ముఖ్యమైన భాగం అయింది. ఆప్తులు, స్నేహితులు, ఆత్మీయులతో నిరంతరం మెసేజ్ల రూపంలోనే కనెక్ట్ అవుతున్నాం. అయితే, మనం సరదాగా లేదా అలవాటుగా పంపే కొన్ని చిన్న మెసేజ్లు ఎదుటివారి మనసును ఎంతగానో బాధపెడతాయట. ముఖ్యంగా ‘hmm’, ‘K’ వంటి సింగిల్ లెటర్ లేదా చిన్న పదాలతో కూడిన రిప్లైలు పెద్ద సమస్యలకు దారితీస్తున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మీరు కూడా ఇలాంటి రిప్లైలు పంపిస్తున్నట్లయితే ఇప్పుడే ఆ అలవాటును మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఇష్టపడే లేదా మిమ్మల్ని ఇష్టపడేవారితో చాటింగ్ చేసేటప్పుడు సరదాగా ‘hmm’ లేదా ‘K’ అని రిప్లై ఇస్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. మీరు సరదాగా అలా పంపినా అది ఎదుటివారిని చాలా బాధపెడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చాలామందికి ముఖ్యంగా యువతలో, ఈ చిన్న మెసేజ్లు తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తున్నాయని, బాధ కలిగిస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు, ఎదుటి వ్యక్తికి తమతో మాట్లాడటానికి ఇష్టం లేదని, లేదా తమ మాటలను పట్టించుకోవడం లేదని వారు భావిస్తున్నట్లు ఈ అధ్యయనాల్లో బయటపడింది.
Read Also:Viral Video : సైకిల్ కు మోటార్ పెట్టి యువకుడి అద్భుతం… గంటకు ఏకంగా 65కి.మీ
‘K’ అనే సింగిల్ లెటర్ రిప్లై చాలామందికి నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఇది సంభాషణను అక్కడికక్కడే ఆపేసినట్లు, లేదా అసలు ఆసక్తి లేనట్లు తెలియజేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. అధ్యయనం ప్రకారం ‘K’ బదులు మరో ‘k’ కలిపి ‘ok’ అని పంపితే బాగుంటుందని సూచించారు. ‘ok’ అనేది మరింత స్నేహపూర్వకంగా, సంభాషణను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తుంది.
డిజిటల్ కమ్యూనికేషన్ పెరిగిన కొద్దీ మనకు తెలియకుండానే కొన్ని ‘చాటింగ్ ఎటికెట్'(చాటింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు లేదా మర్యాదలు) నియమాలను పాటించడం ముఖ్యం. ఎదుటివారికి మెసేజ్ పంపేటప్పుడు వారు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది చాలా కీలకం. డిజిటల్ యుగంలో, పదాలు ఎంత చిన్నవైనా, వాటి ప్రభావం చాలా పెద్దదిగా ఉండవచ్చు. కాబట్టి, చాటింగ్ చేసేటప్పుడు కాస్త అదనపు శ్రద్ధ పెట్టి, అర్థవంతమైన రిప్లైలు ఇవ్వడం ద్వారా మన సంబంధాలను మరింత బలపరచుకోవచ్చు.
Read Also:Viral Video : రోడ్డుపై స్కేటింగ్.. ఎదురుగా గేదెల మంద.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?