Vastu tips: ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి
ఎవరి ఇళ్లు వారికు నచ్చుతుంది. అలాగే ఎక్కడికైనా వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్తే హాయిగా ఉండాలని అనుకుంటారు. కొందరికి బయట కంటే ఇంట్లోనే ప్రశాంతత దొరుకుతుంది.

Vastu tips: ఎవరి ఇళ్లు వారికు నచ్చుతుంది. అలాగే ఎక్కడికైనా వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్తే హాయిగా ఉండాలని అనుకుంటారు. కొందరికి బయట కంటే ఇంట్లోనే ప్రశాంతత దొరుకుతుంది. మరికొందరికి బయట నుంచి వెళ్లిన తర్వాత అసలు ప్రశాంతత లభించదు. ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో చాలా చిరాకు, ఒత్తిడిగా అనిపిస్తుంది. దీనివల్ల ఇంట్లో కూడా ఉండాలనిపించదు. అసలు ఇంట్లో కూడా ఉండకపోతే ఇంకా మనకి ఎక్కడ కూడా ప్రశాంతత లభించదు. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం అంత మంచిది కాదు. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదంటే.. పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: రోజుల్లో తలస్నానం చేస్తున్నారా.. మీకు కటిక పేదరికం తప్పదు
బయట పడేయండి
చాలా మంది పనికి రాని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటారు. వీటిని అలా ఇంట్లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరు ఇంట్లో ఛార్జర్లు అన్ని కూడా ఒక దగ్గర పెడుతుంటారు. అవి కూడా నీట్‌గా కాకుండా చిందరవందరగా పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఇలా ఉంచకూడదు.
స్వచ్ఛమైన గాలి
చాలా మంది ఇంటి మొత్తాన్ని మూసివేస్తారు. కానీ ఇలా కాకుండా బయట గాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంట్లోకి బ్యాక్టీరియా కూడా రాదు. మీరు ఇంటికి వెళ్లిన వెంటనే మీకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది.
సూర్యకాంతి
ఇంట్లోకి సూర్యరశ్మి వచ్చేలా చూడండి. సూర్యకాంతి అనేది పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది. మీ గదికి వెంటిలేషన్ లేకపోతే మాత్రం మీరు డల్‌గా అయిపోతారు. అలాగే మీకు ఆటోమెటిక్‌గా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంట్లోకి సూర్యరశ్మి వచ్చేలా చూసుకోండి. దీనివల్ల మీకు పాజిటివ్ పెరుగుతుంది.
Read Also: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
మొక్కలు
చాలా మంది ఇంట్లో ప్లాస్టిక్ పెంచుతుంటారు. కానీ ఇవి పెంచకూడదని నిపుణులు అంటున్నారు. అవసరం అయితే ఒరిజినల్ మొక్కలు పెంచాలని చెబుతున్నారు. వీటివల్ల చల్లని గాలి, ఆక్సిజన్, పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు గాలిని శుద్ధి చేసి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది.
కర్పూరం
ఇంట్లో కర్పూరం కాల్చండి. దీనివల్ల ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఉంటుంది. మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. బయట నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే అంతా కూడా మంచి జరుగుతుంది.
రాతి ఉప్పు
ప్రతీ రోజు ఇంటిని రాతి ఉప్పుతో క్లీన్ చేయండి. దీనివల్ల ఇంటికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇవి మీకు అన్ని విధాలుగా కూడా మంచిని ఇస్తుంది.
-
Vastu tips: రోజుల్లో తలస్నానం చేస్తున్నారా.. మీకు కటిక పేదరికం తప్పదు
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Easter: ఈస్టర్లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం