Funerals: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయరో మీకు తెలుసా?

Funerals: సాధారణంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేస్తుంటారు. చనిపోయిన కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లోగా అంత్యక్రియలు చేస్తారు. మనిషి చనిపోయేటప్పుడు ఎన్నో నియమాలు పాటిస్తారు. 12 రోజుల వరకు శుద్ధి పాటించడం, ఎవరి ఇంటికి వెళ్లకపోవడం, పూజలు చేయకపోవడం వంటివి అన్ని కూడా ఉంటాయి. అయితే ఎవరైనా చనిపోతే పగలు మాత్రమే అంత్యక్రియలు చేస్తారు. సాయంత్రం సమయాల్లో అయితే అసలు అంత్య క్రియలు చేయరు. అసలు సాయంత్రం సమయాల్లో అనగా చీకటి పడిన తర్వాత అంత్య క్రియలు చేయరు. అసలు సాయంత్రం సమయాల్లో ఎందుకు అంత్య క్రియలు నిర్వహించరు. దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
సూర్యాస్తమయం అయిన తర్వాత అంత్యక్రియలు చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. సూర్యాస్తమయం తర్వాత శవాన్ని దహనం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి కలగదని గరుడ పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు అన్ని కూడా మూసుకుపోతాయి. దీనివల్ల అంత్య క్రియలు చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. చనిపోయిన వారు ఆత్మ గమ్యాన్ని కూడా చేరుకోలేరు. సూర్యాస్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు కాదు.. నరక ద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ కారణం చేతనే మరణించిన వ్యక్తిని రాత్రిపూట అసలు దహనం చేయరు. దహనం చేస్తే నరకానికి వెళ్తారని ఉదయం వరకు ఉంచి.. సూర్యోదయం తర్వాత దహనం చేస్తారు. అలాగే చనిపోయిన వారి ఇంట్లో తర్వాత పుట్టే వారు ఏదైనా లోపంతో జన్మిస్తారని కూడా అంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం తర్వాత అంత్య క్రియలు జరపరు. అయితే అంత్యక్రియలను తండ్రి, కొడుకు లేదా సోదరుడు, మనవడు ఇలా ఇంట్లో పురుషులు ఎవరు ఉంటే వారు చేయాలని మన పురాణాలు చెబుతుంటాయి. ఆడపిల్లలు అసలు అంత్య క్రియలు జరపకూడదని అంటుంటారు.
Read Also: త్వరలో మార్కెట్లోకి పతంజలి ఎలక్ట్రిక్ స్కూటర్ ?
అంత్యక్రియలు జరిపిన తర్వాత ఎన్నో నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా ఎవరిని ముట్టుకోరు. ఎవరి ఇంటికి కూడా వెళ్లరు. మరణాన్ని కూడా ఒక ముట్టుగా భావిస్తారు. కొన్ని రోజుల పాటు అంటు పాటిస్తారు. ఎలాంటి శుభకార్యాలకు హాజరు కారు. సొంత ఇంట్లో చనిపోతే ఏడాది వరకు ఎలాంటి పూజలు కూడా నిర్వహించరు. ఆలయాలకు వెళ్లరు. అయితే బంధువులు అయితే ఒక 12 రోజుల వరకు అన్ని నియమాలను పాటిస్తారు. అయితే కేవలం హిందువులు మాత్రమే ఈ నియమాలు పాటిస్తారు. మిగతా మతాల వారి నియమాలు వేరేగా ఉంటాయి. అయితే హిందువుల్లో కూడా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, సాంప్రదాయాలు మారిపోతుంటాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: కానుకల వర్షం.. ఈ రాశుల వారికి పట్టిందే బంగారం
-
Luxury life: లగ్జరీ లైఫ్ అంటే వీరిదే భయ్యా.. ఈ తేదీల్లో పుట్టిన వారి అదృష్టం మాములుగా లేదు
-
Fault: ఈ దోషం ఉంటే.. దరిద్రమంతా మీ చెంతే!
-
Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
-
Zodiac signs: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే
-
Zodiac Signs: ఈ రాశుల వారి ఆయుధం చిరునవ్వే