Fault: ఈ దోషం ఉంటే.. దరిద్రమంతా మీ చెంతే!
కొందరు జ్యోతిష్యాన్ని నమ్మితే మరికొందరు లైట్ తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కోరి జాతకం ఒక్కోలా ఉంటుంది. దీంతో కొందరికి మంచి జరిగితే.. మరికొందరికి చెడు జరుగుతుంది. అంటే జాతకంలో ఏవైనా తప్పులు ఉంటే కొందరికి కేతు గ్రహ దోషం ఏర్పడుతుంది. వీ

Fault: కొందరు జ్యోతిష్యాన్ని నమ్మితే మరికొందరు లైట్ తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కోరి జాతకం ఒక్కోలా ఉంటుంది. దీంతో కొందరికి మంచి జరిగితే.. మరికొందరికి చెడు జరుగుతుంది. అంటే జాతకంలో ఏవైనా తప్పులు ఉంటే కొందరికి కేతు గ్రహ దోషం ఏర్పడుతుంది. వీటివల్ల కొందరు నష్టాలు ఏర్పడతాయి. ఏ పని ప్రారంభించినా కూడా సరిగ్గా కాదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా వస్తూనే ఉంటాయి. జీవితంలో అసలు ప్రశాంతత అనేదే ఉండదు. ఈ దోషం ఉన్నవారు ఎంత తొందరగా పరిహారం తీర్చుకుంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. ఏం కాదులే అని లైట్ తీసుకుంటే మాత్రం తప్పకుండా సమస్యలు వస్తాయని అంటున్నారు. జీవితంలో ఎదగాలి అనుకున్నా కూడా కేతు దోషం ఉండకూడదు. కేతువు మంచిగా ఉంటేనే లైఫ్‌లో అనుకున్న పనులు అన్ని కూడా సరిగ్గా జరుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ కేతు దోషం ఉంటే పరిహారం కోసం ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
కొందరి జాతకం ప్రకారం కేతు గ్రహ దోషం ఏర్పడుతుంది. అలాంటి వారు ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించాలి. ఆదివారం రోజున వినాయకుని ఆలయానికి వెళ్లి అష్టోత్తర పూజలు నిర్వహించాలి. ఇలా ఒక ఏడు వారాల పాటు ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం వల్ల కేతు గ్రహ దోషం తొలగిపోతుంది. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ముఖ్యంగా కోరుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ కేతు గ్రహ దోషం ఉంటే ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ అభిషేకం నిర్వహించాలి. పాలు, పెరుగు, పంచదార, తేనె వంటి వాటితో అభిషేకం చేయడం వల్ల ఈ దోషం పోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే బ్రాహ్మణులకు దానం చేయాలి. ఉలవలు, నెయ్యి వంటి వస్తువులను దానం చేయడం వల్ల కూడా కేతు గ్రహ దోషం తొలగిపోతుందని పండితులు అంటున్నారు. అలాగే కేతువు అనేది నవ గ్రహాల్లో ఒకటి. ఈ కేతు గ్రహానికి 7 వత్తులతో ఆవు నెయ్యి ఉపయోగించి దీపం పెట్టాలి. ఇలా ఒక ఏడు వారాల పాటు చేయడం వల్ల కేతు గ్రహ దోషం ఏర్పడుతుంది. అలాగే వినాయకుని ఆలయానికి వెళ్లేటప్పుడు బుజ్జ గణపయ్యకు ఇష్టమైన వాటిని తీసుకెళ్లి సమర్పించాలి. ఏడు వారాల పాటు వినాయకుని ఆలయానికి వెళ్లి మోదుగ పువ్వులు, గరికపత్రి, ఎర్ర కలువ పువ్వులు వంటి సమర్పించి అష్టోత్తర పూజలు నిర్వహించాలి. అప్పుడే ఈ దోషం తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.
దోషం తొలగిపోవడానికి కేతు గ్రహం మంత్రాలను కూడా రోజుకి పఠించాలి. వీటిని పఠించడం వల్ల తక్కువ రోజుల్లోనే మీ దోషం పోతుంది. వీటితో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా చదవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాణిపాకం వెళ్లి వినాయకుని దర్శించుకోవాలి. వీలైతే అక్కడ పూజలు కూడా నిర్వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఆవులను దానం పెట్టాలి. ఉలవలను ఆవులకు పెట్టడం వల్ల కేవలం కేతు గ్రహ దోషమే కాదు.. ఎలాంటి దోషాలు అయినా కూడా తొలగిపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీకాళహస్తి వెళ్లాలి. అక్కడ రాహు కేతు పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు చేస్తే తప్పకుండా కేతు గ్రహ దోషం తొలగిపోతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
-
Zodiac signs: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే
-
Zodiac Signs: ఈ రాశుల వారి ఆయుధం చిరునవ్వే
-
Vastu tips: ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు