Mothers Day: కొత్తగా ఈ గిఫ్ట్‌లు ఇస్తూ.. తల్లి ప్రేమను చాటుకోండిలా!

Mothers Day: ప్రతీ ఒక్కరికి కూడా మాతృ ప్రేమ తప్పకుండా ఉండాలి. అవసరం అయినప్పుడు మన ఎమోషన్స్, సంతోషం అన్ని కూడా పంచుకోవడానికి తల్లి ముఖ్యం. బుడి బుడి అడుగుల నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలనే అన్ని విషయాలను కూడా అమ్మ నేర్పిస్తుంది. అమ్మ పెంపకంలో పెరిగిన పిల్లలకు, అమ్మ పెంపకంలో పెరగని పిల్లలకు చాలా తేడా ఉంటుంది. ఇలాంటి అమ్మకు గుర్తింపు ఇస్తూ ప్రతీ ఏడాది మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రతీ ఏడాది మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మే 11వ తేదీన మదర్స్ డే జరుపుకుంటున్నారు. అయితే ఈ మదర్స్ డే రోజు అమ్మలకు కొత్తగా గిఫ్ట్‌లు ఇవ్వండి. అమ్మలు చాలా సర్‌ప్రైజింగ్‌గా భావించే కొన్ని రకాల గిఫ్ట్‌లను వారికి ఇవ్వడం వల్ల ఎంతో సంతోష పడతారు. అయితే మదర్స్ డే నాడు అమ్మలకు బాగా సర్‌ప్రైజింగ్‌గా ఇచ్చే గిఫ్ట్‌లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఫోటో ఫ్రేమ్
అమ్మతో మీకు ఉన్న జ్ఞాపకాలు అన్నింటిని కూడా ఒక ఫొటో ఫ్రేమ్ చేసి గిఫ్ట్‌గా ఇవ్వండి. మంచి ఫొటో ఆల్బమ్ లేదా డిజిటల్ ఫ్రేమ్ అయినా కూడా తయారు చేసి ఇవ్వండి. షాప్‌లో కాకుండా మీరే స్వయంగా తయారు చేసి అమ్మలకు గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అమ్మతో ఉన్న అన్ని మొమోరీస్‌ను కలిపి ఒక వీడియో కూడా తయారు చేయండి. దీన్ని చూసిన వెంటనే అమ్మ మిమ్మల్ని హత్తు కోవాలి. అలా అమ్మకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఉండాలి.
ఇష్టమైన పువ్వులు
అమ్మకు ఇష్టమైన పువ్వులు ఇవ్వండి. ఒకే రకం అని కాకుండా అమ్మకు ఇష్టమైన అన్ని రకాల పువ్వులను అమ్మకు ఇవ్వండి. అయితే అమ్మకు ఏ కలర్ రంగు ఇష్టమో అవే పువ్వులను ఇవ్వండి. అప్పుడు మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పువ్వులతో పాటు ఓ మొక్కను కూడా మీ అమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆ మొక్క పువ్వులు పూసిన ప్రతీసారి మీ అమ్మ నువ్వు గిఫ్ట్ ఇచ్చావని గుర్తు చేసుకుంటుంది. కాబట్టి ఇలా లైఫ్ లాంగ్ గుర్తిండిపోయే గిఫ్ట్‌లు ఇవ్వండి.
ఈ-కార్ట్ గిఫ్ట్స్
అమ్మలకు ఈ-కార్ట్ గిఫ్ట్స్ ఇవ్వండి. ఈ కామర్స్ సైట్‌లో కొనుగోలు చేసి లేదా మీరే తయారు చేసి ఇవ్వండి. ఒక చిన్న కార్ట్ తీసుకుని దానిపై మదర్స్ డే విషెష్ తెలియజేస్తూ గిఫ్ట్ ఇస్తే.. మీ అమ్మలు చాలా ఖుషీ అవుతున్నారు. గిఫ్ట్ చిన్నదే కావచ్చు.. కానీ అమ్మలు మాత్రం కోట్ల రూపాయల కంటే పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, డబ్బులివి కొని ఇవ్వడం మాత్రమే కాకుండా ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అమ్మలు చాలా సంతోష పడతారు. ఇలా కొత్తగా అనిపించేవి ఏవి ఉన్నా కూడా అమ్మలకు సర్‌ప్రైజ్ చేయండి. ది బెస్ట్ మదర్స్ డే గిఫ్ట్‌గా అమ్మల గుండెల్లో ఉండిపోతుంది.
-
Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్
-
Mother’s Day : మదర్స్ డే.. అమ్మలను ఇలా మెప్పించండి
-
Mother’s Day: అమ్మకు ప్రేమతో.. అసలు మదర్స్ డే ఎలా వచ్చింది?
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?