Mother’s Day : మదర్స్ డే.. అమ్మలను ఇలా మెప్పించండి

Mother’s Day ఎలాంటి కల్మషం లేని ప్రేమ అమ్మది. కష్టాలు పడుతూ నవ మాసాలు మోసి.. బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పురిటి నొప్పులను కూడా దాచుకుని.. బిడ్డ కొత్త ప్రపంచాన్ని చూస్తే.. తల్లి నవ్వుతూ స్వాగతిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తల్లి పిల్లలను వదిలేయదు. తల్లి తన ఇష్టాలను వదిలి మరి పిల్లలను చూసుకుంటుంది. ఒక పూట పస్తులు ఉండి అయినా.. పిల్లలు ఆకలితో ఉండకుండా చూసుకుంటుంది. పిల్లలనే సరస్వంగా తల్లి ప్రేమిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేకుండా దొరికే ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి తల్లులు అందరికీ కూడా గుర్తింపు ఇచ్చేందుకు ప్రతీ ఏటా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతీ ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మే 11వ తేదీన ఆదివారం మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మదర్స్ డే రోజున అమ్మలను కొత్తగా మెప్పించడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
వంట చేయండి
మదర్స్ డే రోజున మీ అమ్మ కోసం ఇష్టమైన వాటిని కుక్ చేయండి. మీరే స్వయంగా చేతులతో సమయం కేటాయించి ఇంట్రెస్ట్‌గా చేస్తే.. మీ అమ్మకు నచ్చుతుంది. మీరు ఇలా చేయడం వల్ల మదర్స్ డే రోజున మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది. అయితే మీ అమ్మకు ఏదైతే బాగా ఇష్టమో అదే చేయండి.
బయటకు తీసుకెళ్లండి
మదర్స్ డే రోజున ఇష్టమైన ప్రదేశానికి మీ అమ్మను తీసుకెళ్లండి. ఇష్టమైన పార్క్, రెస్టారెంట్, బెస్ట్ ప్లేస్ ఇలా తీసుకెళ్లండి. అమ్మలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. దీంతో వారు కొన్ని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. అన్ని రోజులు మీకు పనులు ఉంటాయి. కనీసం మీ ఇంటి దగ్గరలో ఉన్న ప్లేస్ లేదా సినిమాకి అయిన మీ అమ్మలను తీసుకెళ్లండి.
అమ్మకు నచ్చే బహుమతులు
అమ్మకు ఏం కావాలనుకున్నా కూడా కొనుగోలు చేయదు. తన పిల్లల కోసం తన ఇష్టాలు అన్నింటిని కూడా వదులుకుంటుంది. కాబట్టి మీ అమ్మకు ఏమైతే ఇష్టమో వాటిని బహుమతిగా ఇవ్వండి. ఉదాహరణకు మీ అమ్మకు ఎప్పటి నుంచో గోల్డ్ కొనాలని ఉంటే.. దాన్నే గిఫ్ట్‌గా కొని ఇవ్వండి. హ్యాండ్ బ్యాగ్, శారీ, ఇంట్లో వస్తువులు ఇలా ఏదైతే ఇష్టమో.. వాటినే గిఫ్ట్‌గా ఇస్తే అమ్మ ఎంతో సంతోష పడుతుంది. ఎంతో గొప్పగా ఇతరులకు చెప్పుకుని మురిసిపోతుంది.
చిన్న సెలబ్రేషన్
మదర్స్ డే రోజున చిన్న సెలబ్రేషన్ ఇంట్లో చేయండి. ఇష్టమైన వంటలు చేసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకోండి. ఇంటిని బాగా అలంకరించి హ్యాపీగా ఉండండి. అమ్మతో కాస్త సమయం గడపండి. అమ్మ సంతోషం, బాధ ఇలా అన్ని విషయాలు తెలుసుకోండి. ఇకపై అమ్మను బాధపెట్టకుండా చూసుకోండి.