Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?

Hair cutting price: సాధారణంగా పురుషులైన, మహిళలు అయినా కూడా అప్పుడప్పుడు జుట్టు కత్తిరించుకుంటారు. అమ్మాయిలు వారి జుట్టును అందంగా చేసుకోవడానికి కత్తిరించుకుంటారు. అదే అబ్బాయిలు అయితే జుట్టు ఎక్కువగా పెరుగుతుందని కత్తిరించుకుంటారు. ఎవరు కత్తిరించుకున్నా కూడా డబ్బుల ఖర్చు అయితే తప్పదు. అబ్బాయిలకు అయినా, అమ్మాయిలకు అయినా కూడా కత్తిరించుకోవడానికి సెలూన్ వారు డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో జుట్టు కత్తిరించుకోవడానికి బాగా ఖర్చు అవుతుందట. అయితే వరల్డ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెయిర్ కట్ సేవలను అందించే దేశం నార్వే. ఈ దేశంలో పురుషుల హెయిర్ కట్ సగటున 64.50 డాలర్లు ఖర్చు అవుతుందట. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 5400 రూపాయలు అన్నమాట. అదే మహిళలకు అయితే హెయిర్ కట్ ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. దాదాపుగా 6500 రూపాయలు అవుతుందట. అయితే నార్వేలో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉన్నందున జుట్టు కత్తిరించడానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తారట.
ఈ ప్రపంచంలో నార్వేలో జుట్టు కత్తిరించుకోవడానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. దీని తర్వాత డెన్మార్క్‌లో హెయిర్ కట్‌కి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఈ దేశంలో సగటున రూ.6300 తీసుకుంటారట. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే. మహిళలకు అయితే రూ.8500 వరకు ఛార్జ్ చేస్తారు. అదే ఆస్ట్రేలియాలో అయితే రూ.8,000 వరకు ఖర్చు అవుతుందట. అలాగే జర్మనీలో అయితే రూ. 2938, అమెరికాలో రూ.3500 తీసుకుంటారట. అదే ఇంగ్లాండ్‌లో అయితే రూ.1,400 తీసుకుంటారు. ఇక రష్యాలో అయితే రూ.1383 ఉంటుంది. ఇలా ఈ దేశాల్లో జుట్టు కత్తిరించుకోవడానికి ఎక్కువగానే ఖర్చు చేస్తారు. అదే ఇండియాలో అయితే కేవలం రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటుంది. అయితే ఎక్కువ ధర కటింగ్ కూడా ఉన్నాయి. కానీ వీటిని ఎక్కువగా సెలబ్రిటీలు చేయించుకుంటారు. సాధారణంగా అయితే తక్కువగానే ఉంటుంది. అందులోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు జుట్టు కత్తిరించుకోవడానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అమ్మాయిల హెయిర్‌కట్‌లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. వీటికి భారీగా ఛార్జ్ చేస్తారు. అలాగే వీ షేప్, యూ షేప్ అంటూ ఇలా ఉంటాయి. అలాగే జుట్టు స్ట్రైటినింగ్ వంటివి కూడా ఉంటాయి. వీటికి అయితే వేలలో ఛార్జ్ చేస్తారు. మళ్లీ ఇవి పర్మినెంట్ అంటే కాదు.. కేవలం టెంపరరీ మాత్రమే ఉంటాయి. టెంపరరీ అయితే ఇంకా ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Starlink : భారతదేశంలో ఏ మారుమూలన ఉన్నా.. సిగ్నల్స్ లేకున్నా హై స్పీడ్ ఇంటర్నెట్
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
-
Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?