Kannappa trailer: కన్నప్ప ట్రైలర్.. అంచనాలకు మించి ఉందా?

Kannappa trailer: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. సుమారుగా 2 నిమిషాల 50 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అయితే అదిరిపోయింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఈసారి పక్కా హిట్ కానున్నట్లు తెలుస్తోంది. శివయ్య మీద భక్తి గురించి ట్రైలర్‌లో తెలుస్తోంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ మెప్పించింది. ట్రైలర్ అయితే బాగుంది. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ప్రభాస్ కాస్త తక్కువ సమయం మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఎక్కువ సమయం ప్రభాస్ ఉంటే బాగుండేదని అంటున్నారు. మోహన్‌బాబు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రానుంది. జూన్ 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేస్తుంది. దట్టమైన అడవులు, ప్రాచీన గుహలు, దేవాలయాలు, విశాలమైన యుద్ధభూములు అత్యద్భుతంగా ఉన్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యున్నత స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా స్థాయిని పెంచే విధంగా విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్‌లో మంచు విష్ణుకి శివుడు అంటే నమ్మకం ఉండదు. కానీ ఆ తర్వాత నమ్మకం కలుగుతుంది. నేను నిన్ను ఇక వదలను అని అంటాడు. అయితే వారి జాతి అతన్ని బహిష్కరిస్తుంది. ఆ తర్వాత మళ్లీ వారి దగ్గరికి ఎలా వెళ్తారనే దానిపై సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రభాస్ ‘రుద్ర’ పాత్రలో కనిపించిన సన్నివేశాలు. ‘యంగ్ రెబెల్ స్టార్’ ప్రభాస్ ఎంట్రీ షాట్లు, ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. శివుడి ఆదేశంతో రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ, తారకమంత్రం “ఓం నమః శివాయ” జపంతో కూడిన పవర్ ఫుల్ షాట్లు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపించి ఆకట్టుకున్నారు. వారి పాత్రల పరిచయం, దృశ్యాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మోహన్‌లాల్, శరత్‌కుమార్, మోహన్‌బాబు వంటి సీనియర్ నటుల ఉనికి, వారి పాత్రల పరిచయం కూడా సినిమాకు బలాన్ని చేకూర్చాయి. బ్రహ్మానందం, ప్రీతి ముఖుందన్ వంటి ఇతర నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
-
Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు
-
Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?