Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ

Kannappa Full Movie Review: మంచు విష్ణు ముఖ్య పాత్రలో నటించిన కన్నప్ప మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శివుడు మీద ఉన్న అమితమైన ప్రేమ అనే జోనర్‌లో తీసిన ఈ మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూ ఈ స్టోరీలో చూద్దాం.
కథ
దేవుడు లేడని, శివ లింగం కేవలం ఒక రాయి మాత్రమేనని చిన్నప్పటి నుంచి తిన్నడు (మంచు విష్ణు) నమ్ముతాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల మహా శివభక్తుడిగా తిన్నడు మారుతాడు. కొందరు వాయు లింగాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారి గూడెం వారిని తగలబెట్టాలని ప్రయత్నిస్తారు. అప్పుడు తిన్నడు వారిని కాపాడే ప్రయత్నంలో రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో శివుడి భక్తురాలు అయిన నెమలిరాణి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. అయితే అసలు ఎలా తిన్నడు శివ భక్తుడిగా మారుతాడు? నెమలిరాణే కారణమా? ఇలా మారడానికి గల కారణం ఏంటి? తాను నమ్మిన వాయు లింగాన్ని కొందరు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు? ఎందుకు అనే విషయాలు తెలియాలంటే మీరు కన్నప్ప మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 40 నిమిషాలు ఒక ఎత్తు. క్లైమాక్స్‌లో సినిమా అయితే అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లు, స్టోరీ, మంచు విష్ణు నటన అంతా కూడా సూపర్‌గా ఉంది. తిన్నడు పాత్రలో మంచు విష్ణు అయితే అదరగొట్టాడు. తన పాత్రలో నటించడం కాదు.. ఏకంగా జీవించేశాడు. సినిమా ఫస్టాప్ కాస్త స్లోగా అనిపించినా కూడా సెకాండాఫ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా రుద్ర పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడు. ప్రభాస్ ఎంట్రీ అన్ని కూడా ఫ్యాన్స్ తగ్గట్లుగానే సెట్ చేశారు. మూవీలో మోహన్ లాల్ పాత్ర కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇక మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు నటన కూడా బాగుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కన్నప్ప తండ్రి పాత్రను పోషించారు. పాత్రకు తగ్గట్లుగా న్యాయం చేశారు. ఇక శివుని పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ బాగా సెట్ అయిపోయింది. మిగతా వారి నటన కూడా బాగుంది. మొత్తానికి సినిమా స్టోరీ అయితే పర్లేదని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుందని, ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని టాక్ వినిపిస్తోంది.
నటన
సినిమాలో ఎవరి పాత్రకు వారు తగ్గట్లుగా చేశారు. ముఖ్యంగా మంచు విష్ణు నటన బాగుంది. తన పాత్రలో జీవించేశాడు. ఇక ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు పాత్రలకు తగ్గుట్లుగా నటించారు.
సాంకేతిక అంశాలు
క్లైమాక్స్ లో వీఎఫ్‌ఎక్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ విలువలు బాగా ఉన్నాయి. లోకేషన్లు, పాటలు, బీజీఎం అన్ని బాగున్నాయి. సినిమాకు తగ్గట్లుగా లోకేషన్లు కూడా అదిరిపోయాయి.
పస్ల్ పాయింట్స్
మంచు విష్ణు నటన
ప్రభాస్ గెస్ట్ రోల్ అద్భుతం
మోహన్ లాల్, మోహన్ బాబు నటన
క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్
భక్తి పాటలు
మైనస్ పాయింట్స్
ఫిల్లర్ ఫస్ట్ హాఫ్
పెద్దగా స్క్రీన్ ప్లే లేకపోవడం
కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 2.8/5
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?