Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?

Kannappa Movie Collections: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్‌తో పాటు స్టోరీ అన్ని బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎక్కువ మంది ప్రముఖ నటులు నటించారు. భక్త కన్నప్ప స్టోరీని బాగా తీశారని నెట్టింట ప్రశంసలు లభించాయి. దేవుడు లేడని, శివ లింగం కేవలం ఒక రాయి మాత్రమేనని చిన్నప్పటి నుంచి తిన్నడు (మంచు విష్ణు) నమ్ముతాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల మహా శివభక్తుడిగా తిన్నడు మారుతాడు. కొందరు వాయు లింగాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారి గూడెం వారిని తగలబెట్టాలని ప్రయత్నిస్తారు. అప్పుడు తిన్నడు వారిని కాపాడే ప్రయత్నంలో రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో శివుడి భక్తురాలు అయిన నెమలిరాణి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. అయితే అసలు ఎలా తిన్నడు శివ భక్తుడిగా మారుతాడు అనే నేపథ్యంలో సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది.
ఇది కూడా చూడండి: Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
కన్నప్ప మూవీ కేవలం 4 రోజుల్లో రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చినా కూడా ఆదివారం సాధారణంగానే కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీటిని మూవీ టీం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సినిమాను రూ.200 కోట్లు పెట్టి తీశారు. కానీ ఈ బ్రేక్ ఈవెన్‌ను దాటడానికి కాస్త సమయం పట్టే్ట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నాలుగు రోజుల కలెక్షన్లు కేవలం రూ.50 కోట్ల వరకు వచ్చాయి. ఇంకా రూ.200 కోట్లు రావాలంటే రూ.150 కోట్లు కావాలి. ఇవి రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ఒక వారం రోజుల్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెద్దగా ఎవరూ కూడా చూడరు. సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు మాత్రమే కాగా.. ఇంత తక్కువ కలెక్షన్లు రావడంతో బ్రేక్ ఈవెన్ దాటడం కూడా కష్టమే అంటున్నారు. ఈ సినిమాపై ప్రశంసించిన వారు ఉండగా.. మరికొందరు బాలేదని అన్న వారు కూడా ఉన్నారు. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు దాటుతుందో చూడాలి.
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
-
Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా
-
Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు
-
Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి