Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?

Holi Colours:
హిందూ సంప్రదాయంలో హోలీకి ఓ ప్రత్యేకత ఉంది. కులమతాలకు అతీతంగా ఈ పండగను దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం హోలీ పండుగను పౌర్ణమి తర్వాత రోజు అనగా.. చైత్ర కృష్ణ ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు. అలాగే హోలికా దహనం ఫాల్గుణ పౌర్ణమి రోజు, భద్రా లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది. హోలీ పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ రాత్రి 12.25 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అనగా మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలోనే హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే హోలికా దహనాన్ని భద్రకాలంలో జరుపుతారు. అంటే మార్చి 13వ తేదీన హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజే హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే హోలీ పండుగను రకరకాల రంగులతో జరుపుకుంటారు. రంగులతో హోలీని జరుపుకోవడానికి అసలు కారణం ఏంటి? ఈ రంగుల వెనుక ఉన్న అర్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎరుపు రంగు
హిందూ సంప్రదాయంలో ఎరుపు రంగును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతీ శుభకార్యానికి ఈ రంగును ఉపయోగిస్తారు. అయితే హోలీలో ఈ రంగును చల్లడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ రంగు ప్రేమ, వివాహం, సంతానోత్పత్తి, శక్తిని సూచిస్తుంది. ఈ రోజున ఎరుపు రంగును భాగస్వామి, లవర్ మీద ఎక్కువగా చల్లుతుంటారు.
ఆకుపచ్చ రంగు
ఆకుపచ్చ పంట పొలాలను సూచిస్తుంది. హోలీ ఈ రంగు వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. దీన్ని ప్రారంభానికి ప్రతీకగా చూస్తారు. అలాగే ప్రశాంతత, ప్రకృతి, కొత్త పనులు ప్రారంభానికి అభివృద్ధిగా కొలుస్తారు. ఈ రంగును ఇతరులపై చల్లడం వల్ల గొడవ, మనస్పర్థలు వంటివి తొలగిపోయి కలిసి ఉంటారని వీటిని చల్లుతారు.
గులాబీ రంగు
అందం కోసం ఈ రంగును హోలీలో పూసుకుంటారు. ఈ గులాబీ రంగు అందం, నమ్మకం, అనురాగాన్ని సూచిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులపై చల్లడం వల్ల నమ్మకంతో కూడిన మంచి బంధం కొనసాగుతుందట.
పసుపు రంగు
ఈ రంగును ఎంతో పవిత్రంగా చూస్తారు. శుభకార్యాలకు ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. అయితే రంగును చల్లడం వల్ల మానసిక వృద్ధి లభిస్తుంది. అలాగే ఆనందం, శాంతి, ఆరోగ్యం అన్నింటిని కూడా సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.
నీలి రంగు
అత్యంత శుభమైన రంగుల్లో ఈ రంగు ఒకటి. దేవతల చర్మం కూడా ఈ రంగులోనే ఉంటుంది. ఈ రంగు స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది.
నారింజ రంగు
ఈ నారింజ రంగు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. ఈ రంగు సూర్య భగవానుని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి
-
Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?
-
Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
-
Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?
-
Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు
-
Holi: ఈ ఏడాది హోలీ ఎప్పుడు.. ఫిబ్రవరి 13న లేకపోతే 14న?