Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Holi Must Visit For Holi

Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!

Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 12, 2025 / 05:36 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Holi:

భారతదేశం అంతటా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోలీని శ్రీకృష్ణుని సంప్రదాయలతో కొన్ని నగరాల్లో జరుపుకుంటారు. అయితే శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. హోలీ పండుగకి ఇక్కడ కొన్ని ప్రదేశాలు రంగులతో నిండిపోతాయి. ఎంతో భక్తితో ఇక్కడ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కేవలం రంగులతోనే కాకుండా వివిధ రకాల వాటితో హోలీ జరుపుకుంటారు. హోలీ పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ రాత్రి 12.25 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అనగా మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలోనే హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే హోలికా దహనాన్ని భద్రకాలంలో జరుపుతారు. అంటే మార్చి 13వ తేదీన హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజే హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే ప్రదేశాల్లో ఎలా హోలీ జరుపుకుంటారు? తప్పకుండా సందర్శించాల్సిన ఆ ప్రదేశాలు ఏంటో చూద్దాం.

పూలతో హోలీ
మథరలోని బృందావనంలో హోలీ వేడుకలను పువ్వులతో జరుపుకుంటారు. బాంకే బిహారీ ఆలయంలో రంగులతో కాకుండా రకరకాల పువ్వులతో హోలీని జరుపుకుంటారు. పువ్వులతో హోలీ చాలా బాగుంటుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. హోలీ సమయంలో బృందావనం ఎంతో కళకళలాడుతుంది.

కర్రలతో హోలీ
మధుర సమీపంలోని బర్సానాలో కర్రలతో హోలీ జరుపుకుంటారు. ఇది అక్కడ చాలా ప్రత్యేకమైనది. ఈ హోలీలో మహిళలు కూడా పాల్గొంటారు. మహిళలు వారిని రక్షించుకోవడానికి పురుషులను కర్రలతో సరదాగా కొడుతుంటారు. ఈ కార్యక్రమానికి చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే ఈ కర్రల హోలీ జరుపుకుంటారు.

వితంతువులకు హోలీ
ఇక్కడ అందరినీ కౌగిలించుకుని కలుపుకునే ఓ సంప్రదాయం ఉంది. వితంతువులు హోలీ జరుపుకోరు. అలాంటి వారికి హోలీని నిర్వహిస్తారు. ఈ హోలీలో మహిళలు రంగు రంగుల దుస్తులు ధరిస్తారు. అలాగే నృత్యాలు కూడా చేస్తారు.

రంగభరి హోలీ
మధురలో ఈ రంగభరి హోలీని జరుపుకుంటారు. ఇక్కడ నీటి బుడగలు, రంగు పొడులు, నీటి తొపాకులతో ఎంతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు.

నందగావ్ హోలీ
మధురలోని నందగావ్ పట్టణంలో నందగావ్ హోలీ జరుపుకుంటారు. ఈ హోలీని శ్రీకృష్ణుడు, అతని పెంపుడు తల్లిదండ్రులు నంద బాబా, యశోద మైయా మధ్య సంబంధాన్ని గుర్తిస్తూ జరుపుకుంటారు. ఆ గ్రామంలో హోలీ రోజు నృత్యాలు చేస్తుంటారు. హోలీకి తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించాలి. ఎంతో ఘనంగా ఇక్కడ వేడుకలను జరుపుకుంటారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • FLowers Holi
  • Holi
  • Mathura
  • Nandagav Holi
  • Rangabari Holi
Related News
  • Rinku Singh: ఎంపీ రింకూ సింగ్‌ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్

  • Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి

  • Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?

  • Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?

  • Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?

  • Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us