Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?

Holi:
త్వరలోనే హోలీ వస్తుంది. ఈ పండుగ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఇక రంగులే రంగులు. ఒకరి మీద ఒకరు పోయడమే పోయడం. ఇక గుడ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడలు, గ్రామాలు, గల్లీలు ఈ వాసనతో ముక్కు మూయించేస్తాయి. ఈ ఎంజాయ్ కోసం దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరుగింది. అయితే ఈ పండుగ సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పండుగ ఆనందం, ఉల్లాసంతో నిండి ఉండటమే కాకుండా, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడంలో ఈ పండుగ పాత్ర చాలా ఉంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ సారి హోలీని మార్చి 14న జరుపుకోనున్నారు. ఇంతకీ ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? హోలీ వల్ల శరీరానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూసేద్దామా?
ఆయుర్వేద సిద్ధాంతం హోలీ గురించి ఏమి చెబుతుందంటే?
హోలీ, హోలికా దహన్‌లో అనేక ఆయుర్వేద సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈ పండుగ శీతాకాలం నుంచి వసంతకాలం వరకు పరివర్తనతో ముడిపడి ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. సూర్యుని వేడి పెరుగుదల వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫం తొలిగిపోతుందని సూచిస్తుంది. ఈ మార్పు కఫ దోషంలో పెరుగుదలను ప్రేరేపిస్తుంది అంటున్నారు పండితులు. అంతేకాదు దగ్గు సంబంధ వ్యాధులకు కూడా దారి తీస్తుందట.
వసంతకాలం ప్రారంభంతో, కలరా, మశూచి వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనిని నివారించడానికి, పురాతన కాలంలో ఋషులు హోలిక దహన్ వంటి ఆచారాలను సూచించారు. హోలీకి ఒక రోజు ముందు ప్రతీకాత్మక శుద్ధీకరణ అగ్నిని వెలిగించారు. ఈ అభ్యాసం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, క్రిములను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. చలికాలంలో ఉండే మంచును పారద్రోలుతుంది అంటున్నారు పండితులు.
ఆవు పేడ పిడికలు, కర్పూరం, కొబ్బరి కట్టెలతో హలోకా దహన్ ను తయారు చేస్తారు. అగ్ని నుంచి వచ్చే పొగ కారణంగా హోలిక దహనంలో పాల్గొనడం వల్ల పునరుజ్జీవనం లభిస్తుందని నమ్ముతారు ప్రజలు. దీనికి క్రిమినాశక లక్షణాలు ఉన్నాయని కూడా చెబుతుంటారు. ఈ ఆచారం చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందట.
రుతువులు మారుతున్న సమయంలో అంటు వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. దీని కారణంగా హోలిక దహన్ నివారణ ఆరోగ్య చర్యలలో అంతర్భాగంగా మారుతుంది. ఈ సంప్రదాయాలను పాటించడం ద్వారా ప్రజలు గులాల్ లేదా అబీర్‌తో ఆడుకుంటారు. కానీ ఇప్పుడు మొత్తం రంగుల మయం అయింది హోలీ. బట్ మొత్తం మీద ఆనందకరమైన వేడుకల్లో పాల్గొనడమే కాదు. శరీరం కాలానుగుణ మార్పుల సమయంలో సరళంగా ఉండేలా చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Holi Celebrations : స్టార్ క్రికెటర్ల హోలీ వేడుకలు.. వీడియో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో?
-
Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి
-
Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?
-
Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?
-
Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
-
Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు