Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?

Holi:
భారతదేశం అంతటా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ రాత్రి 12.25 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అనగా మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలోనే హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే హోలికా దహనాన్ని భద్రకాలంలో జరుపుతారు. అంటే మార్చి 13వ తేదీన హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజే హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. ఒకోక్కరు రకరకాల రంగులతో ఎంతో సంతోషంగా ఈ పండును గుర్తిండిపోయే విధంగా నిర్వహిస్తారు. అయితే మన దేశంలో వారణాసిలో హోలీని రంగులతో కాకుండా బూడిదతో ఆడుతారు. దీన్ని మాసన్ హోలీ అని పిలుస్తారు. బనారస్‌లోని హరిశ్చంద్ర ఘాట్‌లో మహాశ్మశాన నాథ్ ఆరతి తర్వాత ఈ హోలీని ప్రారంభిస్తారు. ఈ హోలీలో సాదువులు, శివ భక్తులు శివుడిని భక్తితో పూజిస్తారు. ఆ తర్వాత చితుల బూడిదతో హోలీ ఆడతారు. ఇలా చితులతో బూడిదతో హోలీ ఆడటం వల్ల శివుడు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ మసాన్ హోలీని జరుపుకుంటారు. అయితే వారణాసిలో ఆరు రోజుల ముందు నుంచే హోలీ పండుగను జరుపుకుంటారు. అందులో మాసన్ హోలీని రెంటారు.
బనారస్ ప్రజలు తప్పకుండా ఈ హోలీని జరుపుకుంటారు. సంస్కృతిక గుర్తింపు కోసం ఇక్కడి ప్రజలు తప్పకుండా ఈ హోలీని జరుపుకుంటారు. అయితే చితి బూడిదతో హోలీ జరుపుకోవడానికి ఓ కారణం ఉంది. ఇది జీవితంలో ఉన్న అస్థిరతను గురించి చెబుతుంది. ఈ చితి బూడిద హోలీ మనిషి జననం, మరణం గురించి తెలియజేస్తుంది. ఈ హోలీలో ఉపయోగించే బూడిదనేది శరీరం, మనస్సు, ఆత్మ నుంచి కాలుష్య కారకాలను తొలగిస్తుంది. ఈ హోలీని అక్కడి ప్రజలు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. ఈ హోలీని వారి జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు.
ఇదిలా ఉండగా మథరలోని బృందావనంలో హోలీ వేడుకలను పువ్వులతో జరుపుకుంటారు. బాంకే బిహారీ ఆలయంలో రంగులతో కాకుండా రకరకాల పువ్వులతో హోలీని జరుపుకుంటారు. పువ్వులతో హోలీ చాలా బాగుంటుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. హోలీ సమయంలో బృందావనం ఎంతో కళకళలాడుతుంది. మధుర సమీపంలోని బర్సానాలో కర్రలతో హోలీ జరుపుకుంటారు. ఇది అక్కడ చాలా ప్రత్యేకమైనది. ఈ హోలీలో మహిళలు కూడా పాల్గొంటారు. మహిళలు వారిని రక్షించుకోవడానికి పురుషులను కర్రలతో సరదాగా కొడుతుంటారు. ఈ కార్యక్రమానికి చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే ఈ కర్రల హోలీ జరుపుకుంటారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి
-
Natural colors : ఇంట్లోనే సహజ రంగులు తయారు చేయడం ఎలాగో మీకు తెలుసా?
-
Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?
-
Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
-
Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?
-
Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు