White crow: కాకుల్లో నల్లటివి మాత్రమే ఉంటాయా? తెల్లటివి ఉండవా!

White crow: సాధారణంగా కాకులు అంటే అందరికీ గుర్తు వచ్చే రంగు నలుపు. ఎందుకంటే కాకులు నల్ల రంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనివల్ల కాకులు అంటే కేవలం నల్ల రంగులో మాత్రమే ఉంటాయని అనుకుంటారు. మీరు కూడా ఇలానే అనుకుంటే పొరపాటే ఎందుకంటే కాకులు కేవలం నలుపు రంగులోనే కాదు.. తెలుపు రంగులో కూడా ఉంటాయి. అయితే ఇవి చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. వీటిని ఎక్కువగా ఫొటోగ్రాఫర్లు గుర్తిస్తుంటారు. వారి కళ్లకే ఈ ఫొటోలు ఈ తెల్ల కాకులు కనిపిస్తాయి. అయితే ఈ తెల్ల కాకులు వేరే జాతికి చెందినవి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇవి తెల్లగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కాకులకు జన్యుపరమైన రుగ్మత ఉంటుంది. వీటివల్ల కొన్ని కాకులు తెల్లగా ఉంటాయి. వీటిని అల్బినిజం లేదా లూసిజం అంటారు. అల్బినిజంలో శరీరంలో ‘మెలనిన్’ అనే వర్ణ ద్రవ్యం లేకపోవడం వల్ల చర్మం, జుట్టు, ఈకలు, కళ్లు తెల్లగా లేదా గులాబీ రంగులో కనిపిస్తాయి. లూసిజంలో ఈకలు మాత్రమే తెల్లగా మారుతాయి. కానీ కంటి రంగు సాధారణంగా ఉంటుంది. ఇలాంటి పక్షి లక్షలాది పక్షులలో ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. తెల్ల కాకి చాలా అరుదు, ఏ ప్రాంతంలోనైనా కనిపించే అవకాశాలు చాలా తక్కువ.
తెల్లని రంగు ఈ కాకి ప్రకృతిలో అలవాటు పడటం, జీవించడం కూడా కష్టం. ఎందుకంటే తెల్లని రంగు పక్షులు ముఖ్యంగా కాకులు, అడవిలో లేదా బహిరంగ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించలేవు. వాటి తెల్లని రంగు వాటిని వేటాడే జంతువుల నుండి దాచడానికి సహాయపడదు. వేటాడే జంతువులు వాటిని సులభంగా చూడగలవు. అందుకే ఇవి ఎక్కువ కాలం అడవిలో ఉండలేవు. మానవుల్లో ఎలా మెలనిన్ ఉంటుందో.. కాకుల్లో అంతే. మానవుల్లో మెలనిన్ ఉన్నవారు తెల్లగా ఉంటారు. అదే తక్కువగా ఉన్నవారు నల్లగా ఉంటారు. కాకుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. దీనివల్ల వల్ల కొన్ని కాకులు తెల్లగా ఉంటాయి. అయితే వీటిని చూసిన వారు చాలా మంది ఆశ్చర్య పడుతుంటారు. నిజానికి కాకులను ఎక్కువగా హిందువులు నమ్ముతారు. వీటికి భోజనం పెడతారు. కాకులు తింటే మన పెద్దవారు తిన్నట్లేనని నమ్ముతారు. ఎక్కువగా పండుగ సమయం, తద్దినాల్లో పెడుతుంటారు. అలాగే కాకులు ఇంటి దగ్గర ఎక్కువగా అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని లేదా ఇంట్లో గొడవలు అవుతాయని నమ్ముతారు. అయితే ఇలాంటివి అన్ని ఒకప్పటి రోజుల్లో నమ్మేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో ఇలాంటివి లేవు. ఇప్పుడు అసలు ఇలాంటివి చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇది కూడా చూడండి: Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?