Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి

Holi 2025 :
దేశవ్యాప్తంగా హోలీ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నారు. రకరకాల రంగులతో ఎంతో ఆనందంగా హోలీ ఆడుతున్నారు. ఎరుపు, పసుపు, పచ్చ ఇలా వేర్వేరు రంగులతో ఎంతో ఆనందంగా చిన్న పిల్లల నుంచి పెద్దా వాళ్ల వరకు వయస్సుతో సంబంధం లేకుండా హోలీ ఆటలు ఆడుతున్నారు. అయితే హోలీ పండుగలో ఎక్కువ మంది బాగా డార్క్‌గా ఉండే కలర్స్ వాడుతారు. వీటిలో ముఖ్యంగా గులాబ్ రంగును ఎక్కువగా వాడుతున్నారు. హోలీకి తప్పకుండా ఈ రంగును వాడుతారు. అయితే ఈ రంగులతో హోలీ ఆడటం సరదానే. కానీ ఆ తర్వాత వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. దుస్తులకు ఈ రంగులు అంటితే మాత్రం వదిలించుకోవడానికి ఎన్నో కష్టాలు పడాలి. మరి దుస్తులకు అంటిని ఈ రంగులను వదిలించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తే.. అవి ముందు వాటిలా మెరుస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
హోలీ రంగులు దుస్తులకు అంటితే మాత్రం వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రంగులు డార్క్‌గా ఉండటంతో అంత తొందరగా వదలవు. అయితే ఈ హోలీ రంగులను వదిలించుకోవాలంటే మాత్రం ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఈజీగా వదిలించుకోవచ్చు. వంట గదిలో నిమ్మకాయ, వెనిగర్ వంటివి ఉంటాయి. వీటితో దుస్తులపై మరకలను ఈజీగా పోగొట్టవచ్చు. నిమ్మకాయ, వెనిగర్, ఉప్పు వంటివి ఉపయోగించి హోలీ రంగుల మరకలను వదిలించవచ్చు. బకెట్ వాటర్‌లో హోలీ రంగుల దుస్తులు వేసి అందులో నిమ్మకాయ రసం, ఉప్పు, వెనిగర్, వాషింగ్ పౌడర్, ఈనో వంటివి వేయాలి. కొంత సమయం వీటిని నానబెట్టి తర్వాత వాష్ చేస్తే మరకలు పోతాయి. మరికొందరు ఇలా కాకుండా వాటర్‌లో ఇవన్నీ వేసి దుస్తు్లతో మరిగిస్తారు. అయితే ఇలా దుస్తులను మరిగించడం వల్ల తొందరగా పాడవుతాయి. కాబట్టి కేవలం వాటర్‌ను మరిగించి అందులో దుస్తులు వేసి ఎక్కువ సమయం నానబెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత వాష్ చేస్తే ఆటోమెటిక్‌గా దుస్తులపై ఉన్న మరకలు తొలగిపోతాయి. హోలీ ఆడటానికి చాలా మంది తెలుపు రంగు దుస్తులు వాడుతారు. వీటిపై మరకలు పడితే మళ్లీ తొలగడం కూడా కష్టమే. అయితే హోలీ రంగులను తొలగించాలంటే మాత్రం కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈజీగా తెలుపు దుస్తులపై రంగులు పోవాలంటే మాత్రం బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేస్తు్ందని నిపుణులు చెబుతున్నారు. బ్లీచింగ్‌ను దుస్తులపై వేసి.. బ్రష్ పెట్టాలి. నెమ్మదిగా బ్రష్‌తో చేస్తే ఈజీగా దుస్తులపై మరకలు తొలగిపోతాయి. ఇవే కాకుండా వెనిగర్, నిమ్మకాయ దుస్తుల మరకలపై వేయాలి. ఇలా వేసిన తర్వాత పది నిమిషాల పాటు బాగా రుద్దాలి. రుద్దితేనే దుస్తులపై ఉన్న కలర్స్ ఆటోమెటిక్‌గా తొలగిపోతాయి. ఆ తర్వాత వేడినీటిలో కొంత సమయం నానబెడితే దుస్తులపై ఉన్న మరకలు అన్ని కూడా తొలగిపోయి.. కొత్త వాటిలా దుస్తులు మెరిసిపోతాయి.
-
Holi Celebrations : స్టార్ క్రికెటర్ల హోలీ వేడుకలు.. వీడియో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో?
-
Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?
-
Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?
-
Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
-
Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?
-
Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు