Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు

Holi Vastu Tips:
హిందూ సంప్రదాయంలో ప్రతీ పండుగకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులో హోలీ కూడా ఒకటి. కులమత భేదం లేకుండా అందరూ కూడా పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం హోలీ పండుగను పౌర్ణమి తర్వాత రోజు అనగా.. చైత్ర కృష్ణ ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు. అయితే ప్రతీ ఏడాది ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిథి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14వ తేదీన జరుపుకుంటున్నారు. హోలి పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ రాత్రి 12.25 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అనగా మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలోనే హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే హోలికా దహనాన్ని భద్రకాలంలో జరుపుతారు. అంటే మార్చి 13వ తేదీన హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజే హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే హోలికా దహన సమయంలో ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచకూడదు. వాటిని ఇంట్లో ఉంచితే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. మరి ఈ సమయంలో ఇంట్లో ఉండకూడని ఆ వస్తువులు ఏవో చూద్దాం.
పాత చెప్పులు
ఇంట్లో పాత చెప్పులు ఉంచకూడదు. సాధారణంగా మీరు వాడుతున్న చెప్పులు కాకుండా చిరిగిపోయినవి, పూర్తిగా వాడని చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. వీటివల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి హోలికి ఇంట్లో ఏవైనా పాత చెప్పులు ఉంటే పడేయండి.
విరిగిన వస్తువులు
పగిలిన, విరిగిన వస్తువులను కొందరు ఇంట్లో ఉంచుకుంటారు. ఉదాహరణకి అద్దం పగిలి ఉంటే వాటిని ఇంట్లో ఉంచుకుంటారు. దీనివల్ల ఇంట్లో నష్టం జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎల్లప్పుడూ కూడా ఇంట్లో గొడవలు రావడం, ఆర్థిక సమస్యలు, గొడవలు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో ఏదైనా పగిలిన వస్తువు, విరిగిన దేవుని ఫొటోలు లేకపోతే ఇతర వస్తువులు కూడా ఉంచవద్దు. వీటిని బయట పడేయడం మంచిది.
చీపురు
కొందరు బాగా అరిగిపోయిన చీపురు వాడుతుంటారు. చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. పాత చీపురు మీరు కూడా వాడుతుంటే దాన్ని పడేసి కొత్త చీపురు కొనండి. అలాగే వీటిని బయట పడేయకుండా మట్టిలో మాత్రమే పాతిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. చీపురు వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
తులసి చెట్టు
హిందువుల ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. కొందరి ఇంట్లో ఎండిపోయిన తులసి చెట్టు ఉంటుంది. దీన్ని మార్చకుండా అలానే వదిలేస్తారు. ఇలాంటి తులసి చెట్టును తీసేసి కొత్తది ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. హోలీ రోజు కొత్త తులసి చెట్టును ఇంట్లో పెట్టడం వల్ల అంతా కూడా శుభప్రదం అవుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Easter: ఈస్టర్‌లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
Ugadi : ఉగాది తర్వాత ఈ రాశుల వారికి పట్టబోతున్న రాజయోగం
-
Holi Celebrations : స్టార్ క్రికెటర్ల హోలీ వేడుకలు.. వీడియో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో?