Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైనది. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు.

Akshaya Tritiya: హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైనది. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే ఈ అక్షయ తృతీయ నాడు ఎక్కువగా బంగారం కొంటారు. ఇలా బంగారం కొనడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే వీటితో పాటు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఏ పని ప్రారంభించినా కూడ ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. కానీ కొందరు మాత్రం అక్షయ తృతీయ వస్తుందంటే రెండు లేదా మూడు రోజుల ముందు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. తెలిసో తెలియక కొనుగోలు చేసిన కొన్ని వస్తువుల వల్ల నష్టాలు వస్తాయని అంటున్నారు. మరి తృతీయ ముందు కొనకూడని ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
అక్షయ తృతీయ రోజు మాత్రమే కాకుండా దీనికి రెండు లేదా మూడు రోజుల ముందు కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. చాలా మంది తెలియక నల్లని గుడ్డలను, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, అల్యూమినియం పాత్రలు, నల్లని దుస్తులు, పదునైన వస్తువులు, ఇనుప వస్తువులను తీసుకువస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే కాకుండా ముందు రోజు కూడా కొనకూడదు. ఎందుకంటే ముందు రోజుకి అక్షయ తృతీయ తిథి ఉంటుంది. ఈ తిథి ఉన్న సమయంతో పాటు ముందుగా రెండు రోజులు ముందుగా కూడా కొనకూడదని పండితులు అంటున్నారు. వీటిని మూడు రోజుల ముందు కొని ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. దీనివల్ల వాస్తు సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి వీటిని ఈ సమయంలో కొని సమస్యలను కొని తెచ్చుకోవద్దు.
Read Also: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచిదని చాలా మంది అప్పు చేసి బంగారం కొంటారు. కానీ ఇలా కొనకూడదని, కొన్నా కూడా దాని ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. పొరపాటున కూడా అప్పు చేసి బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్లిపోతుందని అంటున్నారు. అక్షయ తృతీయ రోజు అప్పు చేయడమే కాదు.. అప్పు ఇవ్వడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు రావడం, డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం వంటివి జరుగుతాయని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్షయ తృతీయ నాడు ఈ మిస్టేక్స్ చేయవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు బంగారం కొనాలా?
-
Easter: ఈస్టర్లో కలర్ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి