Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొనే స్తోమత లేదా.. వీటిని కొనండి
నేడు దేశ వ్యాప్తంగా హిందువులు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. హిందు పండుగల్లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు.buy gold

Akshaya Tritiya: నేడు దేశ వ్యాప్తంగా హిందువులు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. హిందు పండుగల్లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటివల్ల అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే తృతీయ నాడు కొన్ని నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సంతోషం ఉంటుందని, కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు. అయితే అందరికీ కూడా బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు కొనే స్తోమత ఉండదు. అలాంటి వాళ్లు తృతీయ రోజు తప్పకుండా వీటిని కొనడం మంచిది. మరి ఆ వస్తువులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
మట్టి కుండ
అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం, వెండి, ఆస్తులు వంటి విలువైన వస్తువులే కాకుండా.. మట్టి కుండను కూడా కొనుగోలు చేయాలి. మట్టి కుండను కొనుగోలు చేస్తే.. ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. మీ స్తోమతను బట్టి చిన్నది లేదా పెద్దది అయినా మట్టికుండను తప్పకుండా కొనుగోలు చేయండి. దీనివల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు.
ఉప్పు
అక్షయ తృతీయ నాడు తప్పకుండా కొనాల్సిన వాటిలో ముఖ్యమైనది ఉప్పు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు చాలా ప్రీతిపాత్రమైనది. సాధారణంగా ఉప్పును ఎవరికి కూడా అప్పుగా ఇవ్వరు. అయితే ఈ తృతీయ నాడు రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు.
Read Also: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
పత్తి
పత్తిని ఎక్కువగా దీపానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పత్తిని ఈ అక్షయ తృతీయ నాడు కొంటే మంచిది. దీనివల్ల ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కుటుంబంలో సంభవించదు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. బంగారం వంటి విలువైన వస్తువులు కొనలేని వారు తప్పకుండా వీటిని కొనుగోలు చేయండి.
చీపురు
దీన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. అక్షయ తృతీయ నాడు కొత్త చీపురును కొనుగోలు చేస్తే మంచిది. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. డబ్బు కూడా వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: ఈ రాశులకు శని కనక వర్షమే.. దశ తిరగబోతున్న రాశులివే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు బంగారం కొనాలా?
-
Easter: ఈస్టర్‌లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?