Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు

Akshaya Tritiya: ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే ఈ అక్షయ తృతీయ నాడు ఎక్కువగా బంగారం కొంటారు. ఇలా బంగారం కొనడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే వీటితో పాటు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఏ పని ప్రారంభించినా కూడ ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ నాడు ఏ పని చేస్తే డబ్బు వృద్ధి చెందుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
పూజకు కొబ్బరి కాయను నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. అయితే సాధారణంగా కొబ్బరికాయలకు రంధ్రాలు ఉంటాయి. కొన్నింటికి ఒకటి ఉంటే.. మరికొన్నింటికి మూడు రంధ్రాలు ఉంటాయి. అయితే మూడు రంధ్రాలు ఉన్న కొబ్బరి కాయ కాకుండా.. ఒక రంధ్రం ఉన్న కొబ్బరికాయను పూజకు ఉపయోగిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు పువ్వులు, బియ్యం, స్వీట్లు, పంచామృతం (పాలు, పెరుగు, తేనె, గంగా జలం మొదలైనవి) తో పూజ చేయాలి. ఇలా ఒక కన్ను ఉన్న కొబ్బరి కాయను పూజించిన తర్వాత ఇంట్లోనే ఉంచండి. అక్షయ తృతీయ రోజున దీన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి డబ్బు ఉన్న ప్లేస్‌లో ఉంచితే.. మీ ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో అసలు డబ్బు సమస్యే ఉండదు. రోజురోజుకి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇకపై చాలా హ్యాపీగా ఉంటారు.
అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. చాలా మంది తెలియక నల్లని గుడ్డలను, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, అల్యూమినియం పాత్రలు, నల్లని దుస్తులు, పదునైన వస్తువులు, ఇనుప వస్తువులను తీసుకువస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే కాకుండా ముందు రోజు కూడా కొనకూడదు. ఎందుకంటే ముందు రోజుకి అక్షయ తృతీయ తిథి ఉంటుంది. ఈ తిథి ఉన్న సమయంతో పాటు ముందుగా రెండు రోజులు ముందుగా కూడా కొనకూడదని పండితులు అంటున్నారు. వీటిని మూడు రోజుల ముందు కొని ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. దీనివల్ల వాస్తు సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి వీటిని ఈ సమయంలో కొని సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అలాగే అప్పు చేసి బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్లిపోతుందని అంటున్నారు. అక్షయ తృతీయ రోజు అప్పు చేయడమే కాదు.. అప్పు ఇవ్వడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు రావడం, డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం వంటివి జరుగుతాయని అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com ని
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?