Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?

Tholi Ekadasi:సాధారణంగా ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి రోజున ప్రతీ ఒక్కరూ తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. అయితే అన్ని ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. మొత్తం 24 ఏకాదశుల్లో పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఏకాదశి నాడు పూజించడం వల్ల వస్తుంది. అయితే ఈ ఏకాదశి రోజు మహావిష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే తొలి ఏకాదశి పూజను జులై 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించాలి. ఈ సమయంలో నిర్వహించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే పూజ నిర్వహించేటప్పుడు తప్పకుండా ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి. అలాగే పండ్లు, పువ్వులు అన్నింటితో పూజలు చేయాలి. భక్తితో విష్ణువును పూజించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి ఉపవాసాన్ని కూడా చేయాలి. దశమి రోజు సాయంత్రం ఉపవాసం ప్రారంభించి ఏకాదశి రోజు మొత్తం ఉండి ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చిన తర్వాత విరమించాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మహా విష్ణువుకి ఇష్టమైన ఈ ఏకాదశి నాడు తెలిసో తెలియక అసలు తప్పులు చేయకూడదు. వీటివల్ల పాపాలు తొలకకుండా ఇంకా పెరుగుతాయని పండితులు అంటున్నారు. అయితే కొందరు ఈ రోజు కూడా నాన్‌వెజ్ తింటారు. ఇలా తినడం వల్ల పాపాలు పెరుగుతాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు అసలు ఇలాంటి వాటి జోలికి పోవద్దు. అయితే తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. భక్తితో ఆ విష్ణువుని పూజించాలి. అయితే విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం. ఈ పవిత్రమైన రోజు తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. ఎలాంటి పాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇకపై అన్ని విధాలుగా కూడా మంచే ఉంటుంది. అసలు నెగిటివ్ అనేది ఉండదు. అయితే తులసి ఆకులను డైరెక్ట్‌గా కాకుండా మాల చేసి విష్ణు మూర్తికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే తులసి ఆకులతో కేవలం ఏకాదశి నాడు మాత్రమే కాకుండా డైలీ కూడా పూజించడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. కొందరు ఎప్పటి నుంచో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ తొలి ఏకాదశి నాడు ఈ నియమం పాటిస్తే మాత్రం తప్పకుండా మంచి జరుగుతుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం