Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Tholi Ekadasi: హిందూ పండుగల్లో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ తొలి ఏకాదశికి పూజించిన తర్వాత ఈ ఏడాది పండుగలు అన్ని కూడా ప్రారంభం అవుతాయి. అయితే ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఇలా చూసుకుంటే మొత్తం 24 ఏకాదశులు అవుతాయి. వీటిన్నింటిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క ఏకాదశికి పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో తప్పకుండా కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. ఆరోగ్యం బాలేకపోయినా కూడా ఉపవాసం ఆచరిస్తుంటారు. పూర్తిగా వాటర్ కూడా తాగకుండా ఉంటారు. దీనివల్ల ఉన్న సమస్యలు కొందరికి ఎక్కువ అవుతాయి. అయితే తొలి ఏకాదశికి ఉపవాసం తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.
తొలి ఏకాదశి ఉపవాసాన్ని కొందరు దశమి రోజు సాయంత్రం ప్రారంభించి ఏకాదశి రోజు మొత్తం ఉండి ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చిన తర్వాత విరమిస్తారు. అయితే ఇలా ఏం తీసుకోకుండా ఉండటం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కసారిగా కళ్లు తిరిగినట్లు ప్రారంభించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, బాడీ వేడిగా కూడా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం సమయంలో కనీసం మంచి నీరు అయినా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాలు, నీరు, కొబ్బరి నీరు, హెర్బల్ వంటి టీలు అయినా కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఏదో ఒకటి జ్యూస్‌లు తీసుకోవడం వల్ల బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. మసాలా, మాంసాహారం వంటివి కాకుండా పండ్ల రసాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కూడా చేయగలరు. కాబట్టి బాడీకి చలవ చేసే వాటిని తీసుకోవడం మంచిది. సబ్జా, చియా వంటి సీడ్స్‌ను కూడా ఈ సమయంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కూడా ఉపవాసంలో ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
కొందరు ఉపవాసం సమయంలో ఫుడ్ తినకుండా ఎక్కువగా పని చేస్తుంటారు. ఇలా చేయడం మీరు నీరసంగా అయిపోతారు. ఇంకా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా అలసిపోయే పని చేయకుండా ఇంట్లో మెడిటేషన్, యోగా వంటివి చేయడం మంచిది. వీటివల్ల మీరు దేవుడి ధ్యానంలో ఉంటారు. మీ బాడీ కూడా ఎక్కువగా అలసిపోదు. కొందరు ఉపవాసం పూర్తి చేసిన తర్వాత ఎక్కువగా ఏదో ఒకటి తింటారు. ముఖ్యంగా మసాలా ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. ఇలా కాకుండా నిమ్మరసం, నట్స్, పండ్ల రసాలు, పండ్లు వంటి వాటితో పూర్తి చేయాలి. ఎందుకంటే ఒక్కసారి హెవీ ఫుడ్ తింటే గొంతులో నొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Breakup: బ్రేకప్‌తో సతమతమవుతున్నారా.. బయటపడాలంటే ఇలా చేయండి
-
Lazy: బద్ధకం బాగా ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే రిలీఫ్
-
Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం ఎలా?