Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం ఎలా?

Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో మార్పులు అనేవి సహజం. హార్మోన్ల వల్ల చాలా మంది ఒక్కసారిగా బరువు పెరుగుతారు. ఎవరో కొంతమంది అమ్మాయిలు మాత్రమే బరువు తగ్గుతారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం తప్పకుండా బరువు పెరుగుతారు. అయితే దీనికి ముఖ్య కారణం ప్రెగ్నెన్సీలో ఉన్న బరువు డెలివరీ తర్వాత ఉంటారు. దీంతో కొందరు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైన బరువు తగ్గాలని కొందరు జిమ్‌లు చేయడం, వ్యాయామం వంటివి చేస్తుంటారు. దీంతో పాటు ఫుడ్ విషయంలో కూడా మార్పులు చేస్తారు. మరికొందరు ప్రొటీన్ పౌడర్లు వంటివి వాడుతుంటారు. ఇలాంటివి వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు పుట్టిన పిల్లలకు కూడా ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఈజీగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో పూర్తి వివరాల్లో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకమైన ఆహారాలు
బరువు తగ్గాలంటే కేలరీలు తగ్గేలా ఫుడ్ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు, చక్కెర పానీయాలు తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్, పోషకాలు లేని ఫుడ్ వంటివి తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
తల్లి పాలు
కొందరు పిల్లలకు తల్లి పాలు ఇవ్వరు. అయితే పిల్లలకు డైలీ తల్లి పాలు ఇవ్వడం వల్ల రోజుకు సగటున 300–500 కేలరీలు ఖర్చవుతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఇది ఆక్సిటోసిన్ విడుదలను కూడా ప్రేరేపిస్తుంది.. దీనివల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
సున్నితమైన వాకింగ్
డెలివరీ తర్వాత మహిళలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. ఇలా వాకింగ్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అయితే స్పీడ్‌గా కాకుండా నెమ్మదిగా తక్కువగా మాత్రమే వాకింగ్ చేయాలి. అంతే కానీ ఫాస్ట్‌గా ఎక్కువగా నడవడం సరికాదు. నార్మల్ డెలివరీ వల్ల నెల రోజులకి నడవచ్చు. సర్జరీ చేసుకున్న వారు అయితే రెండు లేదా మూడు నెలలకు వాకింగ్ నెమ్మదిగా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
తగినంత నిద్ర
బాడీకి సరిపడా నిద్ర లేకపోవడంతో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. కాబట్టి డెలివరీ తర్వాత తప్పకుండా సరిపడా నిద్రపోవాలి. లేకపోతే బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా ఉంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
వాటర్ ఎక్కువగా తాగాలి
నీరు ఎక్కువగా త్రాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Egg Freezing: ఈ కాలం అమ్మాయిలకు ఎగ్ ఫ్రీజింగ్ ముఖ్యమా? ఏ వయస్సులో చేసుకుంటే బెటర్
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు
-
Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Breakup: బ్రేకప్‌తో సతమతమవుతున్నారా.. బయటపడాలంటే ఇలా చేయండి