Egg Freezing: ఈ కాలం అమ్మాయిలకు ఎగ్ ఫ్రీజింగ్ ముఖ్యమా? ఏ వయస్సులో చేసుకుంటే బెటర్

Egg Freezing: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు డెలివరీ అంటే నార్మల్ అయిపోయేది. కానీ ప్రస్తుతం మంచి ముహూర్తాలు చూసుకుని సర్జరీ చేస్తున్నారు. అయితే అమ్మాయిలు ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే ఆ వయస్సులో చేసుకోవడమే మంచిది. 30 ఏళ్లలో గర్భం దాల్చితే పిల్లలు పుడతారని చెబుతుంటారు. ఆ తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో కొత్త టెక్నాలజీ వచ్చాయి. సాధారణంగా అమ్మాయిలకు ఎగ్ అనేది నెలసరి తర్వాత రిలీజ్ అవుతుంది. అయితే ఈ ఎగ్ ఎంత క్వాలిటీగా ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు. వయస్సు పెరిగిన తర్వాత ఈ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. దీనివల్ల వారు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఇలా ఆలస్యంగా పిల్లలు కనాలని అనుకునే వారికి కొత్త టెక్నాలజీ వచ్చింది. అమ్మాయిలు ముందుగా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని దాన్ని ఉంచుకుని ఆ తర్వాత నచ్చినప్పుడు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. అసలు ఈ ఎగ్ ప్రీజింగ్ అంటే ఏంటి? ఎలా స్టోర్ చేసి పిల్లలను కనవచ్చు? పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది కెరీర్‌లో బిజీగా మారి 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలను పుట్టరని, 30 ఏళ్ల కంటే ముందుగానే పిల్లలను కంటే బెటర్ అని నిపుణులు అంటుంటారు. ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకుని, పిల్లలను కనే అమ్మాయిలు ఎక్కువగా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఎగ్ ఫ్రీజింగ్‌ను అండాశయ క్రయోప్రిజర్వేషన్ అని అంటారు. ఇందులో మహిళల ఎగ్‌ను తీసుకుని, దాన్ని కొన్ని రోజుల పాటు ఫ్రీజ్ చేస్తారు. ఇలా 37 ఏళ్ల వరకు మహిళలు ఎగ్‌ను ఫ్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే పిల్లలను ఆలస్యంగా కనాలని ప్లాన్ చేసుకుంటారో.. వారు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. దీనికి ముందు డాక్టర్లు మహిళల శరీరాన్ని తప్పకుండా చెక్ చేస్తారు. ఆ తర్వాత అండాలను ఉత్పత్తి చేయడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు. అలా ఎగ్‌ను ఫ్రీజ్ చేసి ఉంచుకుంటే.. దాన్ని భవిష్యత్తులో ఉపయోగించవచ్చు. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందని అనుకోవచ్చు. కానీ దీన్ని 1986 లో వచ్చింది. ఆ సమయంలో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగించి మొదటిసారి పిల్లలను పుట్టించారు.
ఈ ఎగ్ ఫ్రీజింగ్‌ను దాదాపుగా 10 ఏళ్ల వరకు ఫ్రజ్ చేయించుకోవచ్చు. అవసరం అయితే 20 సంవత్సరాల వరకు కూడా పొడిగించుకోవచ్చు. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్‌ను కొన్ని భీమా కంపెనీలు కూడా భరిస్తాయి. కీమోథెరపీ, పెల్విక్ రేడియేషన్ వంటి వాటికి చికిత్స తీసుకునే వారు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటారు. కొందరికి రుతుక్రమం ఆగిపోతుంది. అలాంటి వారు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల నచ్చినప్పుడు పిల్లలను కనవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం మంచిదే.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?
-
Children: మాల్స్‌కు కాదు.. పిల్లలను ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి
-
Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం ఎలా?
-
Breast Cancer: ఈ లక్షణాలు మహిళల్లో ఉంటే.. రొమ్ము క్యాన్సర్ తప్పదు
-
Down Syndrome : ప్రెగ్నెన్సీకి ముందే ఈ టెస్టులు చేయించుకోండి.. పుట్టబోయే బిడ్డకు ఏ జబ్బులున్నాయో తెలుస్తుందట
-
Cancer: గ్లోబల్ వార్మింగ్‌తో.. క్యాన్సర్‌కు ఏదైనా సంబంధం ఉందా?