Children: మాల్స్‌కు కాదు.. పిల్లలను ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి

Children: ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా విలాసాలకు ఇష్టపడుతున్నారు. ఆలయాల కంటే పబ్‌లు, షాపింగ్ మాల్స్‌కి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే తల్లితండ్రులు కూడా పిల్లల విషయంలో వారికి నచ్చినట్లు వదిలేస్తున్నారు. చిన్నప్పుడు ఇలాంటి వాటికి అలవాటు పడిన వారు పెద్దయ్యాక హద్దులు దాటుతున్నారు. పిల్లలకు ఎప్పుడూ కూడా షాపింగ్ మాల్స్, షికార్లు కాకుండా కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం మంచిదని నిపుణులు అంటున్నారు. మీరు పిల్లలకు బయటకు తీసుకెళ్లే బట్టి వారి మనస్తత్వం, ఆలోచన తీరు ఉంటుందని అంటున్నారు. అయితే పిల్లలను ఎప్పుడైనా కూడా షాపింగ్ మాల్స్‌కు కాకుండా ఎక్కడికి తీసుకెళ్లాలో ఈ స్టోరీలో చూద్దాం.
పిల్లలను అడవుల్లోకి తీసుకెళ్లండి. పచ్చని చెట్లు, పక్షుల మధ్య వాతావరణ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఆలోచించే తీరు కూడా మారుతుంది. అలాగే వారి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతీ రాష్ట్రంలో కూడా జియోలాజికల్ పార్క్స్ ఉంటాయి. వీటిలో ఎన్నో జంతువులు, పక్షులు ఉంటాయి. వాటి గురించి పిల్లలకు వివరించడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. అదే అడవుల్లోకి తీసుకెళ్లడం వల్ల కొత్త చెట్లు వాటి పేర్లు, ఎందుకు ఉపయోగపడతాయనే విషయాలు కూడా తెలుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో సహజంగా పండే పంటలు, పండ్లు, చల్లని గాలి అన్ని ఉంటాయి. వాటివల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది. అదే షాపింగ్ మాల్స్ అయితే ఏసీలు తప్ప ఇంకా ఏం ఉండవు. వీటివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మీకు సమీపంలో ఏదైనా పచ్చని వాతావరణంతో ఉన్న వాటి దగ్గరికి పిల్లలను తీసుకెళ్లడం వల్ల వారికి కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
చరిత్ర గురించి తెలియజేసే కొన్ని ప్లేస్‌లు ఉంటాయి. ఉదాహరణకు మ్యూజియం వంటివి కొన్ని ఉంటాయి. వీటి దగ్గరికి కూడా పిల్లలను తీసుకెళ్లండి. వీటిలో చాలా కొత్త విషయాలు ఉంటాయి. పిల్లలకి వాటి గురించి పూర్తిగా తెలుస్తాయి. ఇవి వారి భవిష్యత్తుకు కూడా బాగా ఉపయోగపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మ్యూజియంలో చరిత్రకి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉండటంతో వారి చదువుకు కూడా ఉపయోగపడతాయి. వీటివల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పొజిషన్‌లో ఉంటారు. వీటితో పాటు బీచ్, పురాణ ఆలయాలు, ఇతిహాసాల గురించి తెలిపే ప్లేస్‌లకు వారిని తీసుకెళ్లడం వల్ల వారి ఆలోచన తీరు అన్ని కూడా మారుతాయని నిపుణులు అంటున్నారు.