Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?

Post Office Scheme: సంపాదించడం కంటే సేవింగ్స్ చాలా మఖ్యం. ఎంత సంపాదించినా కూడా కాస్త కూడా సేవింగ్స్ చేయకపోతే అసలు వేస్ట్. ఎందుకంటే పూర్తిగా సేవింగ్స్ చేయకపోతే అవసరమైన సమయంలో కాస్త కష్టం అవుతుంది. ఎంత సంపాదించినా, ఖర్చు పెట్టినా కూడా ఎంతో కొంత సేవ్ చేయాలి. అయితే చాలా మందికి సేవింగ్స్ ఎలా చేయాలో కూడా సరిగ్గా తెలియదు. దీనివల్ల అవసరమైన సమయాల్లో డబ్బులకు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఎవరిని అడగకుండా ఉండాలంటే ముందుగానే ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. మనలో చాలా మందికి ఈ పథకాల గురించి సరిగ్గా తెలియదు. ముఖ్యంగా పోస్టాఫీసులో అయితే బెస్ట్ పథకాలు ఉంటాయి. మీరు కేవలం రూ.36 సేవ్ చేస్తే.. మీకు రూ.6 లక్షలు వస్తుంది. ఈ పథకం ఏంటి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీ ఒకసారి చదవాల్సిందే.
పోస్టాఫీస్ బాల జీవన్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో తక్కువగా ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మంచి లాభాలు ఈజీగా పొందవచ్చు. అయితే ఈ పథకంలో రోజుకి రూ.6 నుంచి గరిష్ఠంగా రూ.18 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ స్కీమ్‌కి 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలే ఇన్వెస్ట్ చేయాలి. తల్లిదండ్రులు ఇందులో పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ స్కీమ్‌లో చేరాలని అనుకునే తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే అవుతుంది. ఒకరి పేరు మీద రోజుకి రూ.6 పొదుపు చేస్తే రూ.1 లక్ష వరకు రాబడి వస్తుంది.
అదే మీరు రూ.18 పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తుంది. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే వారి పేరు మీద రోజుకు రూ.36 కడితే రూ.6 లక్షల వరకు రాబడి వస్తుంది. అయితే వీరిలో తల్లిదండ్రులు మరణిస్తే మినహాయింపు ఉంటుంది. ఈ మొత్తాన్ని పాలసీ గడువు పూర్తి అయిన తర్వాత పిల్లలకు ఇస్తారు. ఈ స్కీమ్‌కి అప్లై చేయాలనుకునే వారు పోస్టాఫీస్‌కి వెళ్లాలి. పూర్తిగా డబ్బులు సేవింగ్ లేని వారు ఇలాంటి స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్ద అయిన తర్వాత వారి చదువుకి ఉపయోగపడుతుంది. అదే అమ్మాయిలు అయితే వారి పెళ్లికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి స్కీమ్స్‌లో కట్టండి. మీ అత్యవసర సమయాల్లో ఈ డబ్బులు బాగా ఉపయోగపడతాయి.
ఇది కూడా చూడండి: Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..
-
Children: మాల్స్‌కు కాదు.. పిల్లలను ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి
-
Post Office Scheme: బెస్ట్ స్కీమ్ భయ్యా.. రూ.100 డిపాజిట్ చేస్తే లక్షలు
-
Chanakyaniti: డబ్బు సంపాదించడం కాదు.. పొదుపు ముఖ్యం.. చాణక్యుడు చెప్పే సూత్రాలివే
-
SIP: సిప్‌లో నెలకు వెయ్యి ఇన్వెస్ట్ చేస్తే.. కోట్లలో డబ్బు మీ సొంతం
-
Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?