Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..

Arjun Das: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అందరితో విమర్శలు అందుకుని.. ఇప్పుడు ప్రశంసంలు అందుకుంటున్న నటుడు అర్జున్ దాస్. చాలా మందికి ఈ పేరు వినగానే నటుడు కంటే.. వాయిస్‌గానే ఎక్కువగా గుర్తు పడతారు. ఎందుకంటే ఇతని వాయిస్‌లో అంత బేస్ ఉంటుంది. అర్జున్ దాస్ కంటే వాయిస్‌కి ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఇస్తున్నాడు. తన వాయిస్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. అయితే ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు ట్రైలర్‌లో అర్జున్ దాస్ వాయిస్ వినిపించింది. ఇతని వాయిస్‌తోనే ట్రైలర్ ప్రారంభం అవుతుంది. బేస్ వాయిస్‌తో ట్రైలర్‌ను అమాంతం పేంచేశాడు.
ఇదే కాకుండా గతేడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలకు కూడా అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చారు. అయితే ఇతని వాయిస్‌లో మ్యాజిక్ ఉందని స్టార్ హీరోల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు తన వాయిస్‌కి ఎక్కువగా విమర్శలు వచ్చాయట. స్కూల్ డేస్ నుంచి తన బేస్ వాయిస్‌కి వాల్యూ ఉందట. కాకపోతే కొందరు మాత్రం తన వాయిస్ వింతగా ఉందని విమర్శించేవారట. అర్జున్ దాస్ సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఉద్యోగం వదిలేశారు. మొదటిగా రేడియో జాకీగా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అయితే అర్జున్ దాస్ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కూడా ఎన్నో రిజక్షన్స్ వచ్చాయట. తన వాయిస్‌పై కామెంట్లు కూడా వచ్చాయని, మరికొందరు వాయిస్ వల్ల అవకాశాలు కూడా ఇవ్వలేదని పలు ఇంటర్వ్యూలో తెలిపారు.
అర్జున్ దాస్ సినిమాల్లో మొదటిగా 2012లో ‘పేరుమాన్’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనకి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది. కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ సినిమాల్లో అర్జున్ దాస్ కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా విక్రమ్ మూవీ క్లైమాక్స్‌తో అర్జున్ దాస్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి అతని వాయిస్‌కు ఫ్యాన్స్ అయ్యారు. దీని తర్వాత ఒక్కసారిగా అర్జున్ దాస్ కెరీర్ మారిపోయింది. కల్కీ 2898 ఏడీ, హరి హర వీర మల్లుతో పాటు పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘ఓజీ’ మూవీకి కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ అందించారు. ‘ముఫాసా ది లయన్ కింగ్’ లోని ముఫాసాకు అర్జున్ దాస్ తమిళంలో వాయిస్ ఓవర్ ఇచ్చారు. అర్జున్ దాస్ కేవలం నటుడిగా, వాయిస్ ఓవర్‌గా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా నటిస్తోంది. అన్నింట్లో నటిస్తూ తన కంటే ప్రత్యేక గుర్తింపును ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!
-
Pawan Kalyan : ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం చేసుకున్న ‘హరి హర వీర మల్లు’.. ఎప్పుడంటే ?
-
Rajamouli : మహేష్ సినిమా కోసం ఏకంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్న దర్శక ధీరుడు జక్కన్న
-
Pawan Kalyan: ‘హరి హర వీర మల్లు’ విడుదల కాకముందే మరో సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్!
-
OG: ఓజీలో అర్జున్ దాస్.. పవన్ చేతులకు రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్