Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’ సినిమాకు అదిరిపోయే ప్రచారం దక్కబోతోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు హీరోలు, దర్శకులు వస్తారు. కానీ ఈ సినిమా ప్రచారానికి ఏకంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఇందులో ఒకరు పవన్ కళ్యాణ్ స్వయంగా డిప్యూటీ సీఎం అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇది సినిమాకు భారీ హైప్ తీసుకురావడం ఖాయం. పవన్ కళ్యాణ్ తనను తాను ‘అన్ అపాలజెటిక్ హిందూ’ అని చెప్పుకుంటూ, అవకాశం దొరికినప్పుడల్లా హిందుత్వం పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో హిందుత్వ నాయకుడిగా ఎదగడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే హిందుత్వ నాయకులలో ప్రముఖుడైన యోగి ఆదిత్యనాథ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించి, ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపించనుండటం రాజకీయంగా, సినీ పరంగా చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’ సినిమా ఈ నెల చివరిలో అంటే జూలై 24న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ధర్మం పేరుతో హిందువులపై అకృత్యాలు జరుగుతున్న సమయంలో వాటికి వ్యతిరేకంగా నిలబడిన ఒక యోధుడి పాత్రలో నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పై పోరాడి గెలిచే యోధుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
Read Also:Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
సినిమా జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఏ ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. సినిమాకు భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జులై 19న తిరుపతిలో ఈ భారీ ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరుకానున్నారు. సీఎం మాత్రమే కాకుండా మరికొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని సమాచారం.
అంతేకాకుండా, ‘హరి హర వీర మల్లు’ సినిమాకు సంబంధించి వారణాసిలో కూడా ఒక ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరగనుంది. జులై 17న జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు, ఉత్తరప్రదేశ్ మంత్రులు, భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ‘హరి హర వీర మల్లు’ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. దయాకర్ రావు, ఎ.ఎం. రత్నం నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
Read Also:Honey: తేనె ఎందుకు పాడవదు.. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?