Leopard Attacks In Tirupati: తిరుపతిలో బైక్ ప్రయాణికులపై చిరుత దాడి.. వీడియో వైరల్
Leopard Attacks In Tirupati ప్రమాద సమయంలో బైకర్ల వెనుక వెళ్తున్న కారులో ఉన్న ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్ లో ఈ విజువల్స్ ను రికార్డు చేశారు.

Leopard Attacks In Tirupati: తిరుపతిలో బైక్ ప్రయాణికులపై చిరుత దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. అలిపిరి ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై ఒక్కసారిగా దాడికి చిరుత యత్నించింది. అదృష్టవశాత్తూ వారు తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బైకర్ల వెనుక వెళ్తున్న కారులో ఉన్న ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్ లో ఈ విజువల్స్ ను రికార్డు చేశారు.
ఇప్పటికే ఇదే మార్గంలో పలుమార్లు చిరుతలు దర్శనమిచ్చిన ఘటనలు జరుగుతున్నాయి. దీంతో అలిపిరి, జూ పార్క్ రూట్ మీద ప్రయాణించే భక్తులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో బైక్ లపై ప్రయాణించేవారు భయపడుతున్నారు. టీటీడీ భక్తులకు భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలలో రాత్రి బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించిన చిరుత
అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డులో ఘటన
తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు pic.twitter.com/y46OmvCndj
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2025