Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇది ఒక భారీ హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, అయితే కొంత భాగం జ్యోతికృష్ణ కూడా డైరెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ట్రైలర్ విడుదల తేదీ ఖరారు కావడమే కాకుండా, పవన్ కళ్యాణ్ ట్రైలర్ ఫైనల్ కట్‌ను చూసి మెచ్చుకున్నారని తెలుస్తోంది. అయితే, ఈ ట్రైలర్ కట్ వెనుక త్రివిక్రమ్ సహాయం ఉందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘హరిహర వీరమల్లు’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11:10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్‌కు సంబంధించిన ఫైనల్ కట్ కూడా సిద్ధమైందని, దీనిని పవన్ కళ్యాణ్ ఇటీవల వీక్షించారని తెలుస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సంతోషం వ్యక్తం చేశారని, డైరెక్టర్‌ను అభినందించారని సమాచారం. “చాలా కష్టపడ్డావ్…” అంటూ దర్శకుడిని మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక వీడియో లీక్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!
చాలా కష్టపడ్డావ్.. దర్శకుడిని అభినందించిన పవన్
‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన టీమ్. ‘చాలా కష్టపడ్డావ్..’ అంటూ దర్శకుడిని అభినందించిన పవన్. pic.twitter.com/6WO3tblU8b
— ChotaNews App (@ChotaNewsApp) July 2, 2025
గత కొంతకాలంగా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా పనులను వేగవంతం చేయడానికి, అవుట్‌పుట్‌ను మెరుగుపరచడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సహాయం అందిస్తున్నారని సినీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌కు మంచి మిత్రుడు కావడంతో పాటు, మాటల మాంత్రికుడిగా, దర్శకుడిగా ఆయనకు ఉన్న అనుభవం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ ఫైనల్ కట్ విషయంలో కూడా త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లీక్ అయిన వీడియోలో పవన్ కళ్యాణ్ దర్శకుడిని అభినందించడం, ఆ ప్రశంసలు ట్రైలర్ క్వాలిటీకి నిదర్శనంగా భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో ట్రైలర్‌ను చూసి మెచ్చుకోవడంతో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు, సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించడం ఖాయమని, అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Read Also:Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Kannada: ‘హరిహరవీరమల్లు’’సినిమాకు కర్ణాటకలో షాక్