Chanakyaniti: డబ్బు సంపాదించడం కాదు.. పొదుపు ముఖ్యం.. చాణక్యుడు చెప్పే సూత్రాలివే

Chanakyaniti: డబ్బు.. డబ్బు.. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు శాసించేది ఇదే. ప్రతీ ఒక్కరూ కూడ డబ్బు వెంట పడుతున్నారు. అయితే అందరూ చేసే తప్పు ఏంటంటే.. డబ్బు సంపాదిస్తారు. కానీ దాన్ని ఎలా పొదుపు చేయాలనే విషయం కూడా సరిగ్గా తెలియదు. లక్షలు, కోట్లు సంపాదించినా కూడా పొదుపు చేయడం తెలియని వాడికి వేస్ట్. ఎందుకంటే ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదు. ఎంత పొదుపు చేశాం.. ఆ డబ్బును ఎంత రెట్టింపు చేశామన్నదే ముఖ్యం. కానీ ప్రస్తుతం రోజుల్లో చాలా మంది వెచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు. సంపాదించిన మొత్తం కూడా విందు, వినోదాలకు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల వారికి అవసరం అయినప్పుడు అసలు డబ్బులు ఉండటం లేదు. ఎంత సంపాదించి ఖర్చు పెట్టినా కూడా ఎంతో కొంత సేవ్ చేస్తేనే ఫలితం ఉంటుంది. అయితే డబ్బును పొదుపు చేయడానికి ప్రతీ ఒక్కరూ కొన్ని సూత్రాలు పాటించాలని చాణక్యుడు అంటున్నాడు. మరి చాణక్యుడు చెప్పే ఆ సూత్రాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
చాలా మంది ఆదాయానికి మించి ఖర్చులు చేస్తుంటారు. అయితే ఖర్చులు అనేవి అలా ఉంటేనే ఎప్పుడైనా డబ్బులు పొదుపు చేస్తారని చాణక్యుడు అంటున్నాడు. ఆదాయానికి మించి ఎప్పుడైతే ఖర్చులు ఉంటాయో వారి జీవితం సంతోషంగా ఉండదు. ఆదాయం ఒక రూ.1000 ఉంటే దాని బట్టే ఖర్చులు చేసుకుంటే సంతోషంగా ఉంటారు. అందులో వచ్చిన డబ్బులు పొదుపు చేయాలని చాణక్య నీతి చెబుతోంది. అలాగే ప్రతీ రూపాయి ఖర్చు చేసేటప్పుడు తప్పకుండా ఆలోచించి తీరాలని అంటున్నాడు. ఆలోచించకుండా ఖర్చు చేస్తే తర్వాత సమస్యలు వస్తాయని అంటున్నారు. కొందరు గొప్పలకు పోయి ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో వారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేస్తుంటారు. ఇలా చేస్తే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కుంటారు.
మీ దగ్గర ఎంత ఉంటే అంతలో మాత్రమే ఖర్చు చేయండి. గొప్పలకు పోతే మీరే సమస్యలో ఎదుర్కొంటారని చాణక్యుడు అంటున్నాడు. చాలా మంది డబ్బు సంపాదించడం తెలుసు. కానీ దాన్ని ఎలా పొదుపు చేయాలనే విషయం అయితే తెలియదు. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. దాన్ని పొదుపు చేయడం అనేది చాలా ముఖ్యం. పొదుపుపై కనీస అవగాహన లేకుండానే చాలా మంది ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మీకు వచ్చిన డబ్బులో కనీసం 25 శాతం అయినా కూడా పొదుపు చేయాలి. అలా సేవ్ చేయడం వల్ల అవి అవసరానికి ఉపయోగపడతాయి. చాలా మందికి ఈ ట్రిక్ తెలియక అప్పు చేసి మరి ఇంకా ఖర్చు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. కొంత డబ్బులు సేవ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని చాణక్య నీతి చెబుతోంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Scheme: ఈ స్కీమ్‌లో రూ.55 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.3 వేల పెన్షన్.. ఎలాగంటే?
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?